గన్నవరపు నరసింహమూర్తి
స్వరూపం
(గన్నవరపు నరసింహ ముర్తి నుండి దారిమార్పు చెందింది)
గన్నవరపు నరసింహమూర్తి తెలుగు రచయిత. ఇతను సుమారు 561 కధలు, 20 నవలలు రాసాడు. అతను రాసిన కథలు అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి.[1]
జీవిత విశేషాలు
[మార్చు]గన్నవరపు నరసింహమూర్తి విజయనగరము జిల్లా, బొబ్బిలి దగ్గర కుసుమూరు అగ్రహారం లో వెంకటరమణ మూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1966 జూలై 1న జన్మించాడు. ఇతను సివిల్ ఇంజినీరింగు లొ బి టెక్, ఎమ్ టెక్ చదివారు. రైల్వేలో ఎక్జిక్యూటివ్ ఇంజనీయర్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, విశాఖపట్నంలో పనిచేసాడు. తరువాత జాయింట్ జనరల్ మెనెజర్ గా పనిచేస్తున్నారు. వీరు విశాఖపట్నం లో స్థిరపడ్డారు. వీరి భార్య శకుంతల, పిల్లలు శ్రీనివాస్, శ్రీకీర్తన ఇతను ప్రాధమిక విద్యను కుసుమూరులో చదివారు.
రచనలు
[మార్చు]సంపుటాలు
[మార్చు]- గంధం చెట్టు
- గాలివాన
- వుడుతా భక్తి
- వీణా వేదనం
- తూర్పు పదమర
- గమ్యం
- అక్షరాభ్యాసం
నవలలు
[మార్చు]- మట్టి మనుషులు ,
- అగ్ని పధం ,
- తూర్పు సంధ్యారాగం,
- అంకురం,
- అరణ్యం,
- మిత్రలాభం ,
- మట్టివాసన ,
- సింధూరం ,
- స్వర్ణమయూరం,
- ధర్మచక్రం ,
- భూమి గుండ్రంగా వుంది
సుమారు 15 కథలకు బహుమతులు వచ్చాయి.
మూలాలు
[మార్చు]- ↑ "గన్నవరపు నరసింహమూర్తి - కథానిలయం". kathanilayam.com. Retrieved 2025-10-28.