గారి బెకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త గారి బెకర్. 1930 డిసెంబర్ 2 న జన్మించిన గారి బెకర్ ప్రిన్స్‌టన్, చికాగో విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. విచక్షణా పూర్వక ఆర్థిక విషయాలపై పరిశోధన చేసి చికాగో విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందినాడు. మానవ వనరులపై, మానవ ప్రవర్తన రంగాలకు గారి బెకర్ ఆర్థిక సిద్ధాంతాన్ని విస్తరించచేశాడు. అతను అర్థశాస్త్రానికి చేసిన సేవలకు గాను 1992లో అర్థశాస్త్రపు నోబెల్ బహుమతి పొందినాడు. 2007లో అమెరికా ప్రభుత్వపు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు లభించింది.