Jump to content

గార్డెన్ ఆఫ్ ఈడెన్

వికీపీడియా నుండి
గార్డెన్ ఆఫ్ ఈడెన్

గార్డెన్‌ ఆఫ్‌ ఈడెన్‌ (Garden of Eden) బైబిల్‌ ప్రకారం దైవం మొదట మనిషిని సృష్టించి ఉంచిన వనం ఈడెన్‌. జెన్సిస్‌ (Genesis) రెండవ అధ్యాయంలో ఈ వివరాలు ఉన్నాయి. పదిహేనవ వచనంలో ఈడెన్‌ గార్డెన్‌ ప్రస్తావన ఉంది. దైవం మొదట ఒక పురుషుడిని సృష్టించాడు. ఆ ఆది పురుషుడి పేరు ఆదం (Adam). వనంలో ఏ చెట్టుకు కాసిన ఫలాన్నయినా తినవచ్చును గానీ, మంచి చెడుగుల జ్ఞాన వృక్షం చాయలకు మాత్రం పోవద్దని దైవం హెచ్చరించాడు. తరువాత జంతు జాలాన్ని, విహంగ జాలాన్ని కూడా సమకూర్చాడు. ఆదమ్‌కు తోడు ఉండాలని ఒక స్త్రీని కూడా సృష్టించాడు. ఆదమ్‌కు గాఢ నిద్ర కలిగించి, అతడి పక్కటెముక ఒకటి తీసుకొని దానితోనే ఆమెను సృష్టించాడు. ఆదమ్‌ అన్ని జంతువులకి, పక్షులకి పేర్లు పెట్టాడు. ఆ స్త్రీని గురించి ‘‘ఈమె నా ఎముకలలో ఎముక. నా శరీర మాంసంలో మాంసం. కనుక Woman (వుమన్‌) అని పిలుద్దామనుకొన్నాడు. అప్పటికి వారిద్దరిపై ఏ ఆచ్ఛాదనలు లేవు. ఐనా వారిరువురికి సిగ్గు అంటే ఏమిటో తెలియలేదు. కాని, అటు తరువాత వారు నిషిద్ధ వృక్ష ఫలాన్ని తినడం, పతనం కావడం సృష్టినే ఒక పెద్ద మలుపు తిప్పింది. బైబిల్‌ ప్రకారం, సృష్టిలో ఈడెన్‌ గార్డెన్‌కు ఇంత పెద్ద పాత్ర ఉంది. ఈ వనం మెసపటోమియా ప్రాంతంలో ఉండేదని కొందరు పరిశోధకుల అభిప్రాయం.

మూలాలు

[మార్చు]
  • [పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 ]

ఇతర లింకులు

[మార్చు]