గాలవుఁడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1. కువలయాశ్వునికి అశ్వమును ఇచ్చిన ఒక ఋషి. 2. శుక్లయజుర్వేదాధ్యాపకుడు ఐన ఒక ఋషి. ఇతనిని, గురువు ఐన విశ్వామిత్రుడు ధవళవర్ణములు అయి ఒక్కకర్ణము నీలమైన ఉత్తమాశ్వములను ఎనమన్నూటిని తనకు గురుదక్షిణగా తెచ్చి ఇమ్ము అనిన ఆగుఱ్ఱములను ఎందును పడయనేరక తన బాలసఖుఁడు ఐన గరుడుని వెంటబెట్టుకొని యయాతిదగ్గఱకు పోయి అతని పుత్రిక అగు మాధవి అను కన్యను పడసి ఆమెసహాయమున అయోధ్యాధిపతి అగు ఇక్ష్వాకు మహారాజు నొద్దను, భోజపురినాథుడు అగు శిబియొద్దను, కాశిరాజు అగు దివోదాసునియొద్దను ఇన్నూఱేసి హయములను పడసి ఆకన్యను ఆఱు నూఱు గుఱ్ఱములను విశ్వామిత్రునకు ఇచ్చి అతనిని తృప్తి పొందించెను.

గాలవుడు అనగా చేపలకు గాలము వేసే వాడని కూడ అర్థమున్నది. అనగా జాలరి అని అర్థము.

పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

"https://te.wikipedia.org/w/index.php?title=గాలవుఁడు&oldid=2281573" నుండి వెలికితీశారు