గాలిపటం

వికీపీడియా నుండి
(గాలి పటం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సాధారణ గాలిపటం

ఒక చతురస్రాకారపు కాగితం, రెండు వెదురు బద్దలు, తగినంత దారం ఉపయోగించి వినోదం కోసం గాలిలోకి ఎగరవేసే ఒక ఆట వస్తువు పతంగి లేదా గాలిపటం (Kite). పతంగులను ఆంధ్రులు ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఎగురవేస్తారు. గాలిపటాల్ని ఎక్కువగా సరదా కోసం ఎగురవేస్తారు. అయితే కొన్నిప్రాంతాలలో ఇదొక కళారూపం సంతరించుకున్నది. దీనివలన కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. కొన్ని గాలిపటాలు పోటీల కోసం వివిధ డిజైన్లు ఆకర్షణీయంగా తయారుచేస్తారు. కొన్ని పెద్ద గాలిపటాలు అధిక శక్తివంతమైనవిగా సర్ఫింగ్, బోర్డింగ్ లేదా బుగ్గీయింగ్ వంటి క్రీడలలో ఉపయోగిస్తున్నారు.[1] కొన్ని గాలిపటాల్ని మిలటరీలో ఉపయోగించారు.[2]

ఎందుకు ఎగురుతుంది?

[మార్చు]

గాలిపటం ఎగరడానికి ముఖ్యంగా దారంలోని బలం (tension) ప్రధానమైన కారణం.[3] దీనికి కావలసిన లిఫ్ట్ గాలి మూలంగా కలుగుతుంది. గాలిపటం డిజైన్ వలన గాలిపటం పైభాగంలో తక్కువ ఒత్తిడి క్రింది భాగంలో ఎక్కువ ఒత్తిడి కలిగి ఎగురగలుగుతుంది. ఇదే మూలసూత్రం గాలివీచే దిక్కుగా ముందుకు పోవడానికి తోడ్పడుతుంది. ఈ రెండు బలాలకు దారం లేదా దారాలలోని బలం వ్యతిరేకదిశలో పనిచేసి గాలిపటాన్ని నియంత్రిస్తుంది.[4] గాలిపటాన్ని నిలకడగా ఎగురవేయవచ్చును లేదా కొన్ని సార్లు పరిగెడుతూ, పడవ లేదా ఇతర కదిలే వాహనాలపై నుండి కూడా ఎగురవేయవచ్చును.[5][6][7]

గాలిపటాలు సామాన్యంగా గాలి కంటే బరువైనవి. అయితే కొన్ని రకాలు గాలికంటె తేలికైనవి కూడా తయారుచేస్తారు. వీటిని "హెలికైట్" (Helikite) అంటారు, ఇవి వీచేగాలి లేకుండా కూడా ఎగురుతాయి. దీనిలో హీలియం బెలూన్ ఉపయోగిస్తారు.

తయారు చేసే విధానం

[మార్చు]
జర్మనీ గాలిపటాల పోటీలో వివిధ రకాల గాలిపటాలు
అష్టపది గాలిపటము, క్లోవిస్, న్యూ మెక్సికో లోని గాలిపటాల పోటీ.

గాలిపటాలను గాలిలో తేలికగా ఎగరటానికి అనువైన కాగితం లేదా పట్టు (సిల్క్) వస్త్రము లాటివాటితో చేస్తారు.ఒకటి లేదా రెండు వెదురు లేదా కోబ్బరి ఈనెల లాటి పుల్లలను తెర`చాప ఆధారాల మాదిరిగా అమర్చి కాగితాన్ని అతికించి పుల్ల మధ్యలో దారం (సూత్రం) కడితే గాలి పటంతాయారు అవుతుంది, గాలిలో నియంత్రణ కలిగి ఉంటానికి తోకని కూడా అమర్చటం కద్దు. సాంప్రదాయకంగా గాలిపటాలలో కొబ్భరి ఈనె, వెదురు బద్ద లేదా పేము లాంటి తేలిక పాటి వంగే గుణంవుండే పుల్లలను ఆధారాలుగా, కాగితాన్ని ఎగురటకు తోడ్పడే తెర లాగా వాడతారు. ఆయితే నవీన పద్ధతులలో గాలి పటాలని ఉలిపిరి పొరలవంటి (ఫాయిల్ ) తెరలను ఉపయోగించి ఏవిదమయిన ఆధారాలు లేకుండానే తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు తెరలకి ఆకర్షణీయమైన ఫైబర్-గ్లాస్ (కృత్రిమమైన నారతో చేసే గాజు ), కార్బన్-నార లాంటి వాటిని తెరలుగా, డెక్రాన్ లేదా డైనీమా లాంటి కృత్రిమ పదార్దాలని ఆధారాలుగా వాడుతున్నారు. గాలిపటాలను మామూలు దారం లేదా ట్వయిన్-దారంతొ ఎగరవేయిటం జరుగుతుంది. కొన్నిసార్లు వేరే గాలిపటాల దారాన్ని తెంచటానికి గాజుపిండిని దారానికి పూయటం జరుగుతుంది.

గాలిపటాలని అనేక ఆకారాలలో తయారు చేయవచ్చు, ఆధునిక పద్ధతులలో థ్రీడైమన్ష్న్ గాలిపటాలను ఉబ్బే పొరల (ఇన్ఫ్లేటబుల్) తో ఎటువంటి ఆధారాలు లేకుండా తయారు చేస్తున్నారు, ఆయితే మాములుగా పిల్లలు ఆడుకునే గాలిపటాలు రేఖీయ (చతురస్ర, డైమండ్ మొదలగు) నమూనాలను పోలి వుంటాయి. ఆసియా ఖండంలో పిల్లలు ఇట్లోవాడే ఠావులు, వార్తాపత్రికలు లేదా ఎండిన ఆకులకు కుట్టుడు దారంతో సూత్రంకట్టి ఆడుకోవటంకద్దు.[ఆధారం కోరబడినది]

గాలిపటాలను మామూలుగా ఎగిరే కీటకాలు, పక్షులు, జంతువులు మొదలైన రూపాల్లో తయారు చేస్తుంటారు. మంచి నాణ్యత కలిగిన చైనా గాలిపటాలను చీల్చిన వెదురు బద్దలఆధారాలతో పట్టువస్త్రం ఉపయోగించి తయారు చేసి హస్తకళాచిత్రాలతో అలంకరిస్తారు. తక్కువ కర్చుతో పెద్దయెత్తున ఉత్పత్తి చేసే గాలిపటాలను ప్రింటెడ్-పాలిస్టర్ తో తయారు చేస్తారు. పెద్దపెద్దగాలిపటాలను మడతపెట్టటానికి వీలుగా మడతకీళ్ళ (హింజ్ ) లతో తయారుచేస్తారు. ఎటుచూసినా ఒకే మాదిరిగా ఉండే గాలిపటాల ముక్కును గాలివీచేదిశలో వుంచటానికి తోకను వాడతారు, దృశ్య సహాయకాలుగా తిరిగే చక్రాలని (స్పిన్నర్స్ ), స్పిన్ సాక్స్ లని వాడతారు. గాలిపటాలను సమాచారాన్ని చూపించుటకు కూడా వుపయోగిస్తారు, ఇలాంటి గాలిపటాలలో పెద్ద పెద్ద స్పిన్నర్స్, స్పిన్ సాక్స్ 15మీ|| (50 అడుగుల) వరకూ వుంటాయి. ఆధునిక గాలిపటాలు అనేక వంపులతో గాలిలో కచ్చితమయిన నియంత్రణ కలిగి వుంటాయి. కొన్నిగాలిపటాలలో అత్యవసరంగా గాలిపటాన్ని ఎగరవేసేవారినుంచీ విడదీయటానికి ఎర్పాటు వుంటుంది.

ప్రమాదాలు

[మార్చు]

గాలిపటాల సాధారణంగా చిన్న చిన్న ప్రమాదాలు మాత్రమే జరుగుతాయి. ఎక్కువ ప్రమాదాలు మంగా లేదా దారం తయారీలో వాడే గాజుపొడి మూలంగా జరుగుతున్నాయి. దీని వలన ఎగరేస్తున్న వ్యక్తి యొక్క వేళ్ళు కోసుకొనిపోవచ్చును. అందువలన ఎగరేస్తున్న వేలుకు రక్షణగా తొడుగును ఉపయోగించడం మంచిది. రహదారి ప్రక్కన తెగిపడిన గాలిపటం యొక్క దారం మూలంగా రహదారి ప్రమాదాలు జరుగుతాయి. మేడ పైభాగం నుండి గాలిపటం ఎగురవేస్తూ క్రిందపడే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో గాలిపటం ఎగరేస్తున్నప్పుడు తడిగానున్న దారం విద్యుత్ తీగలకు తగులుకొని ఎగరేస్తున్న వ్యక్తి విద్యుద్ఘాతానికి గురికావచ్చును.

చెన్నైలో గాలిపటం ఎగరేస్తే జైలే

[మార్చు]

చెన్నైలో గాలిపటాలు ఎగరేస్తే జైల్లో పెడతారు. చెన్నై పోలీసులు ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం గాలిపటాలు ఎగరేయడం నేరం. గాలిపటాలను ఎగరేయడానికి ఉపయోగించే దారాని (మాంజా) కి గాజు పెంకులతో తయారు చేసిన పొడి పూస్తారు. దీనివల్ల దారం చాలా పదునుగా మారి తెగుతుంది. మాంజాతో గాలిపటాలు ఎగరేస్తే రూ.1000 జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష విధిస్తారు. రెండేళ్ల క్రితం చెన్నైలో మాంజా వల్ల గాయపడి ఓ బాలుడు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గాలిపటము. వనస్థలిపురము

గాలిపటాల పండుగ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Deep In the Heart of Texas by Dave Broyles Archived 2008-12-02 at the Wayback Machine Boat kiting
  2. Focke-Achgelis Fa 330A-1 Bachsteltze (Water Wagtail) Kite is preserved in the Smithsonian National Air and Space Museum
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-03-25. Retrieved 2009-04-01.
  4. Flying High, Down Under Archived 2008-12-01 at the Wayback Machine When the kite line broke, the kites still received tension from the very long kite line.
  5. "Science in the Field: Ben Balsley, [[CIRES]] Scientist in the Field Gathering atmospheric dynamics data using kites. Kites are anchored to boats on Amazon River employed to sample levels of certain gases in the air". Archived from the original on 2008-03-14. Retrieved 2009-04-01.
  6. The Bachstelze Article describes the Fa-330 Rotary Wing Kite towed by its mooring to the submarine. The kite was a man-lifter modeled after the autogyro principle.
  7. "Kite Fashions: Above, Below, Sideways. Expert kiter sometimes ties a flying kite to a tree to have the kite fly for days on end" (PDF). Archived from the original (PDF) on 2011-07-23. Retrieved 2009-04-01.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గాలిపటం&oldid=3887620" నుండి వెలికితీశారు