గాలోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాలోడు
దర్శకత్వంరాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల
నిర్మాతరాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల
తారాగణంసుడిగాలి సుధీర్
గెహన సిప్పీ
సప్తగిరి
షకలక శంకర్
ఛాయాగ్రహణంసి. రాంప్రసాద్
కూర్పుఎం.ఎస్.ఆర్
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
సంస్కృతి ఫిలింస్
విడుదల తేదీ
18 నవంబర్ 2022
దేశంభారతదేశం
భాషతెలుగు

గాలోడు 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ బ్యానర్‌పై రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకత్వం స్వీయ నిర్మాణ దర్శకత్వం వహించాడు. సుడిగాలి సుధీర్, గెహన సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 4న విడుదల చేసి[2], సినిమా డిసెంబరు 18న థియేటర్స్‌లో విడుదలైంది.[3]

కథ[మార్చు]

రాజు (సుధీర్) అల్లరితనం, చిల్లర పనులు చేస్తూ గాలోడుగా తన ఊర్లో గాలి తిరుగుళ్ళు తిరుగుతూంటాడు . ఓ రోజు సర్పంచ్ కొడుకుతో పేకాటలో జరిగిన గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోవడంతో హైదరాబాద్ కి పారిపోతాడు. హైదరాబాద్ వచ్చిన అతడికి శుక్లా (గెహ్నా సిప్పీ) తో పరిచయమవుతోంది. ఊర్లో హత్య చేసి పారిపోయిన రాజుని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మరి జైలు నుంచి రాజు ఎలా బయటకి వస్తాడు? ఈ సమస్యల్ని ఎదుర్కొని రాజు శుక్లాతో ప్రేమని ఎలా నిజం చేసుకున్నాడనేది మిగతా సినిమా కథ.[4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: సంస్కృతి ఫిలింస్
  • నిర్మాత: రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల[5]
  • సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  • సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
  • ఎడిటర్ : ఎం.ఎస్.ఆర్
  • కోరియోగ్రఫీ : బాబా భాస్కర్, అనీష్, వెంకట్ దీప్
  • పాటలు: కాసర్ల శ్యామ్, శ్రీనివాస్ తేజ, శ్రీ అమిత్ రాజ్ పుట్ల, సురేష్ గంగుల, శ్రీశ్రీ రంగా
  • ఫైట్స్ : వింగ్చూ అంజి

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (7 November 2022). "వినోదాన్ని పంచే 'గాలోడు'". Retrieved 8 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Sakshi (4 November 2022). "సుడిగాలి సుధీర్‌ 'గాలోడు' మూవీ ట్రైలర్‌ వచ్చేసింది". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  3. Sakshi (7 November 2022). "మాస్ అండ్‌ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'గాలోడు'.. రిలీజ్‌కు రెడీ". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. NTV Telugu (18 November 2022). "గాలోడు మూవీ రివ్యూ". Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.
  5. V6 Velugu (22 November 2022). "గాలోడు విజయాన్ని ముందే ఊహించా: డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి". Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గాలోడు&oldid=3744324" నుండి వెలికితీశారు