గింజలను ఆరబెట్టుట
పంటకోసిన తర్వాత గింజల్లో ఉన్న తేమ శాతాన్ని తగ్గించి ఆహారానికి, విత్తన వృద్ధికి ఉపయోగిస్తారు. కోసిన ధాన్యములను యంత్ర సహాయమున గింజలను ఆరబెట్టుటకు సహజ సిద్ధమైన గాలి లేక వేడిచేసిన గాలిని గింజల ద్వారా ప్రవహింపజేసి అందులోని తేమ శాతం తగ్గించవచ్చును . గింజలలోనున్న తేమ శాతమును డ్రైయర్లలను ఉపయోగించి తగ్గించవచ్చును.
డ్రైయర్లలో రకములు
[మార్చు]ప్యాక్ డ్రైయర్
[మార్చు]ఈ విధానమునందు ఒక పెద్ద గదిలో నేలపై భాగమున పెద్ద పెద్ద గాడులు తయారు చేసి వాటిపై రంధ్రములు కలిగిన స్టీలు రేకులను అమర్చుతారు . బయటనుండి అయిల్ ఇంజనును లేక కరెంట్ మోటారు ద్వారా నడుపబడు బ్లోయరు ద్వారా గాలిని గదిలోనికి పంపుతారు . ఈ గాలి వివిధ గాడుల ద్వారా, స్టీలు రెకుల పై గల రంధ్రముల ద్వారా సంచిలో ఉన్న గింజలకు తగిలి గింజల తేమ శాతమును తగ్గిస్తుంది.
బ్యాచ్ లేక బిన్ డ్రైయరు
[మార్చు]ఈ పద్ధతి యందు గింజలను విడిగా కాని, ఒక పద్ధతి యందు గింజలకు చలనమునందు ఉంచి 1 నుండి 2 టన్నుల వరకు ఆరబెట్టే డ్రైయరులను బ్యాచి డ్రైయర్లు అని అంటారు. 3 లేక అంతకంటే ఎక్కువ ఆరబెట్టే డ్రైయర్లను బిన్ డ్రైయరులు అని అంటారు ., దీర్ఘచతురస్రాకారము, క్రమపడ్భుజి ఉండి వాటిని ఒక స్థలము నుండి మరియొక స్థలమునకు తీసుకపొవుటకు అనువుగా “ ట్రాన్సు పొర్టింగ్ వీల్సు " అమర్చబడి ఉండును.[1]
ఎల్.ఎస్. యు. డ్రైయర్
[మార్చు]ఎల్ ఎస్ యు డ్రైయర్ అనగా లూసియానా స్టేట్ యూనివర్శిటీ డ్రైయర్. ఈ డ్రైయరులో ముఖ్యముగా గింజలను ఉంచుటకు బిన్ను లేక హాపరు, డ్రైయింగ్ చాబరు గింజలను క్రిందకు పంపే మెకానిజం లేక పద్ధతి, బ్లోయరు, గాలిని వేడిచేయు యంత్రము, గాలిని ప్రవహింపచేయుటకు త్రిభుజూకారములో రంధ్రములుండును . ఇందులో గింజలను ఉంచు బిన్ను, డ్రైయింగ్ చాంబరు చతురస్రాకారములో ఉండి 1.2 x 1.2 మీటర్లు, 1.5 X 1.5 మీటర్లు, 1.8 x 1.8 మీటర్లు 2.11 2.1 మీటర్లు కొలతలు కలిగి యుండును డ్రైయరు ఎత్తు దీని కెపాసిటిని బట్టి ఉండును . డ్రైయింగ్ చాంబరునకు ఒక వైపు త్రిభుజాకారములో వేడిగాలి ప్రవహింప చేయుటకు సమాన సంఖ్యలో, సమాన పరిమాణముగల ఇన్లెట్ట్, అవుట్ చానల్స్ లేక ప్రవాహ గాడులు ఉండును .
ఇన్లెట్ ఛానల్స్ అనగా వేడి గాలిని బ్లోయరువద్ద నుండి డ్రైయింగు చాంబరు లోనికి ప్రవహింప చేయునవి ఎగ్జాస్ట్ లేక అవుట్ లెట్ అనగా గింజలను తాకిన తరువాత గాలి, డ్రైయింగ్ చాంబరు నుండి బయటకు ప్రవహింప చేయునది . ఈ విధముగా మొదటి వరుస ఇన్లేట్ ఛానల్స్ అయినా రెండవ వరుస ఎగ్లాస్ ఛానల్స్ ఆగును . ఈ విధముగా 1,3,5,7,9 వరుస ఛానల్స్ ఇన్ లేట్ గాను 2,4,6,8,10 వరుస చానల్స్ అవుటైట్ ఛానల్స్ ఆగును . బ్లోయరు నుండి గాలిని ప్రవహింప చేయుటకు అనుకూలముగా బ్లోయరు వైపు ఇన్ ఛానల్స్ తెరువబడి యుండి రెండవ ప్రక్క మూయబడి యుండును . అందువలన గాలి నేరుగా ఛానల్ ద్వారా బయటికి పోదు . అవుటైట్ ఛానల్ లో బ్లోయరు వైపు మూయబడి యుండి రెండవ ప్రక్క తెరువబడి ఉంటాయి.[2]