గిరీష్ భరద్వాజ్
స్వరూపం
గిరీష్ భరద్వాజ్ (జననం: 1950 మే 2 ) భారతదేశంలోని మారుమూల గ్రామాలలో 127 వంతెనలను నిర్మించినందుకు సేతు బంధు, బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ఒక భారతీయ సామాజిక కార్యకర్త. 2017లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. [1][2][3][4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]భరద్వాజ్ 1950 మే 2న కర్ణాటక సుల్లియా లో జన్మించాడు. 1973లో మాండ్య పి. ఇ. ఎస్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు.[1][5] అతని భార్య ఉష. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కెరీర్
[మార్చు]ఆయన 1989లో దక్షిణ కర్ణాటకలోని అరంబూర్ వద్ద పయస్విని నదిపై తన మొదటి వంతెనను నిర్మించాడు. అప్పటి నుండి, ఆయన కేరళలో సుమారు ముప్పై వంతెనలను, తెలంగాణ, ఒడిశాలో రెండు వంతెనలని నిర్మించాడు, మిగిలిన వంతెనలు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి.[3][6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Sullia's bridge-man gets Padma Shri". The Times of India. Retrieved 11 August 2017.
- ↑ "President Pranab Mukherjee confers Padma awards". Outlook. Retrieved 11 August 2017.
- ↑ 3.0 3.1 "Padma Shri award: 'Bridge Man' credits it to his employees". Deccan Chronicle. Retrieved 11 August 2017.
- ↑ "Invincible Indians: Solid People, Solid Stories". Firstpost. Retrieved 11 August 2017.
- ↑ "Bridge man Girish Bharadwaj at VVIET". Star of Mysore. Retrieved 11 August 2017.
- ↑ "Padma award winners from Karnataka are an eclectic mix". The Hindu. Retrieved 11 August 2017.