గీత బాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీత బాలి
జననం1930[1]
అమృత్ సర్ పంజాబ్ భారతదేశం
మరణం1965 జనవరి 21
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు1950–1964
భార్య / భర్తషమ్మీ కపూర్|1955}}
పిల్లలుఆదిత్య రాయ్ కపూర్

గీతా బాలి (జననం హర్కీర్తన్ కౌర్ ; 1930 - 21 జనవరి 1965) హిందీ సినిమా నటి. గీతబాలీ భారతీయ చలనచిత్ర నటీమణులలో ఒకరు. [2] గీతబాలి రెండు దశాబ్దాల సినీ జీవితంలో 75 సినిమాలకు పైగా నటించారు. గీత బాలి ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు రెండుసార్లు నామినేట్ అయింది. [3]

గీతబాలి తన నట జీవితాన్ని ది కాబ్లర్ (1942) సినిమాతో బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించింది సోహగ్ రాత్ (1948) సినిమా తో గీత బాలి మొదటి విజయాన్ని సాధించింది. బడి బహెన్ (1949) సినిమాలోలో నటించిన తర్వాత, బావ్రే నైన్ (1950), అల్బెలా (1951), బాజీ (1951), జాల్ (1952), ఆనంద్ మత్ (1952) వంటి సినిమాలలో గీత బాలి నటించింది. వచన్ (1955), మిలాప్ (1955), ఫరార్ (1955), జైలర్ (1958) మిస్టర్ ఇండియా (1961). సినిమాలు గీత బాలికి పేరు తెచ్చిపెట్టాయి.

గీతబాలి 1955లో నటుడు షమ్మీ కపూర్‌ను వివాహం చేసుకుంది., గీత బాలికి నటుడు ఆదిత్య రాజ్ కపూర్‌తో సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. గీత బాలి 1965 లో మశూచి కారణంగా మరణించింది. [4]

బాల్యం[మార్చు]

గీత బాలి 1930లో బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని అమృత్‌సర్‌లో జన్మించింది [1] గీత బాలికి హరిదర్శన్ కౌర్ అనే అక్క ఉంది, హరి దర్శన్ కౌర్ కుమార్తె నటి యోగితా బాలి . [5] గీత బాలి శాస్త్రీయ నృత్యం, గుర్రపు స్వారీ గట్కాలో శిక్షణ పొందింది. [6]

నట జీవితం[మార్చు]

బారీ బెహెన్ సినిమాలో గీత బాలి (1949)

గీత బాలీ తన 12వ ఏట ది కాబ్లర్ (1942) సినిమాతో బాలనటిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. గీత బాలి బద్నామి (1946) సినిమాతో ప్రధాన నటిగా సినీ రంగంలోకి అరంగేట్రం చేసింది. గీత బాలి దాదాపు 75 చిత్రాలలో నటించారు. [7] సోహగ్ రాత్ (1948) బడి బహెన్ (1949 సినిమాలతో గీత బాలి తొలి విజయాలను అందుకున్నారు. [8] [9]


1950లలో గీత బాలి స్టార్ హీరోయిన్ గా మారింది. గీత బాలి రాజ్ కపూర్‌తో కలిసి బావ్రే నైన్ (1950) [10] అనే సినిమాలో నటించింది. ప్రముఖ హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్‌తో కలిసి గీత బాలి ఆనంద్ మఠం, సినిమాలో నటించింది. ఈ రెండూ సినిమాలు విజయవంతమయ్యాయి. [11]

దేవ్ ఆనంద్‌తో కలిసి గీత బాలి బాజీ (1951), జల్ (1952), ఫెర్రీ (1954), మిలాప్ (1955), ఫరార్ పాకెట్ మార్ (1956) లాంటి సినిమాలలో నటించింది. [12] [13] [14] గీత బాలి వచన్ (1955) సినిమాకు గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. [15]

గీత బాలి తన భర్త షమ్మీ కపూర్‌తో కలిసి మిస్ కోకా కోలా (1955), రంగీన్ రాటెన్ (1956) వంటి సినిమాలలో నటించింది., కాఫీ హౌస్ సినిమాలో(1957) గీత బాలి పాట పాడింది. [16] గీత బాలికి దులారి (1949), నిషానా (1950), అల్బేలా (1951), అల్బేలి (1955), కవి (1955). లాంటి సినిమాలు పేరు తెచ్చి పెట్టాయి. [17] గీత బాలి చివరిసారిగా 1963లో వచ్చిన జబ్ సే తుమ్హే దేఖా హై సినిమాలో నటించింది. [1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

గీత బాలిని ప్రముఖ నటుడు షమ్మీ కపూర్ ముంబైలోని మలబార్ హిల్ సమీపంలోని బంగంగా ఆలయంలో వివాహం చేసుకున్నారు. [18] 1956 జూలై 1న వారికి పెళ్లయిన ఒక సంవత్సరం తర్వాత గీత బాలి దంపతులకు ఆదిత్య రాజ్ కపూర్ జన్మించాడు. ఐదు సంవత్సరాల తరువాత, 1961లో గీత బాలికి, కంచన్ కపూర్ జన్మించింది. [19] [20]

మరణం[మార్చు]

గీత బాలి 1965 జనవరి 21న 35 సంవత్సరాల వయస్సులో మశూచి వ్యాధి కారణంగా మరణించింది. [2] [21] గీత బాలి మరణానంతరం, షమ్మీ కపూర్ 1969 జనవరి 27 న గుజరాత్‌లోని భోజపరాకు చెందిన నీలా దేవిని వివాహం చేసుకున్నాడు, ఆమె గీత బాలి పిల్లలను కూడా చూసుకుంది. [22] [23]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Adrian Room (26 July 2010). Dictionary of Pseudonyms: 13,000 Assumed Names and Their Origins. McFarland. pp. 44–. ISBN 978-0-7864-4373-4. Retrieved 22 April 2012.
  2. 2.0 2.1 Dinesh Raheja. "Geeta Bali: That Amazing Vivaciousness". Rediff.com. Retrieved 29 December 2019.
  3. "Top heroines of Bollywood". India Today. Archived from the original on 28 November 2020. Retrieved 24 August 2020.
  4. "How Shammi Kapoor married Geeta Bali: She took out lipstick, asked him to apply it on her maang". India Today. 24 January 2020. Retrieved 20 January 2020.
  5. Saran, Sathya; Alvi, Abrar (2008). Ten Years with Guru Dutt: Abrar Alvi's Journey (in ఇంగ్లీష్). Penguin Books India. pp. 7, 43. ISBN 978-0-670-08221-6.
  6. "Geeta Bali's personality had the energy of Shammi Kapoor's dance". The Quint. 21 January 2016. Archived from the original on 4 January 2012. Retrieved 25 October 2020.
  7. Subodh Kapoor (2002). The Indian Encyclopaedia: Gautami Ganga -Himmat Bahadur. Cosmo Publications. pp. 2575–. ISBN 978-81-7755-266-9. Retrieved 22 April 2012.
  8. "Top Earners 1946". Box Office India. Archived from the original on 14 June 2010. Retrieved 10 July 2008.
  9. NFAI adds Suraiya's 1949 film Bari Behen to collection 26 February 2017 Times of India, Retrieved 23 May 2020
  10. Ritu Nanda (2002). "Filmography-Raj Kapoor". Raj Kapoor: Speaks. Penguin Books India. pp. 198–. ISBN 978-0-670-04952-3.
  11. "Anand Math's song Vande Mataram - The World's Top Ten". BBC World Service. Retrieved 15 November 2008.
  12. Kohli, Suresh (14 June 2012). "Blast from the past: Faraar (1955)". The Hindu. Archived from the original on 20 June 2017. Retrieved 20 June 2017.
  13. Bhatia, Uday (7 September 2019). "Who killed the Hindi gangster film?". mint (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2020. Retrieved 13 August 2021.
  14. "Dev Anand saga: When Navketan went noir". The Times of India (in ఇంగ్లీష్). 10 December 2011. Retrieved 12 April 2021.
  15. Kaur, Devinder Bir (16 July 1999). "Melodrama was his forte". The Tribune. Retrieved 25 September 2009.
  16. Deepa Gahlot (1 January 2008). Shammi Kapoor: The Dancing Hero. SCB Distributors. pp. 82–. ISBN 978-81-8328-228-4. Retrieved 29 October 2015.
  17. "Top Earners 1951". Box Office India. Archived from the original on 21 January 2011. Retrieved 7 August 2011.
  18. "Blast from the past: Shammi Kapoor and Geeta Bali's sudden marriage". Filmfare. 24 April 2021. Retrieved 22 February 2022.
  19. Parande, Shweta (4 May 2010). "Acting is in my genes: Aditya Raj Kapoor". CNN-IBN. Archived from the original on 7 May 2010. Retrieved 7 December 2014.
  20. Ramesh Dawar (1 January 2006). Bollywood Yesterday-Today-Tomorrow. Star Publications. pp. 1–. ISBN 978-1-905863-01-3. Retrieved 22 April 2012.
  21. Jain, Madhu (2005). The Kapoors: the first family of Indian cinema. Penguin, Viking. ISBN 0670058378.
  22. "Neila Devi: I knew I'd always get second billing". Filmfare. 25 September 2012. Archived from the original on 16 December 2013. Retrieved 8 November 2018.
  23. "Shammi Kapoor". Junglee.org.in. Archived from the original on 19 August 2011. Retrieved 18 August 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=గీత_బాలి&oldid=4089429" నుండి వెలికితీశారు