గీత (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీత
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.కె.మూర్తి
తారాగణం లీలారాణి,
ప్రసాద్ బాబు, రేలంగి, ముక్కామల, కె.వి. చలం, విజయభారతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ చేతనా ప్రొడక్షన్స్
భాష తెలుగు

గీత 1973, డిసెంబర్ 21న విడుదలైన తెలుగు సినిమా. [1] ఇది 1970లో వెలువడిన హిందీ సినిమా చేతనా ఆధారంగా తీయబడిన సినిమా. ఆ చిత్రంలో శత్రుఘ్న సిన్హా, అనిల్ ధావన్, రెహనా సుల్తాన్ నటించారు.

నటీనటులు[మార్చు]

 • ప్రసాద్‌బాబు
 • లీలారాణి
 • రేలంగి
 • రామ్మోహన్
 • కోళ్ళ సత్యం
 • ముక్కామల
 • కె.వి.చలం
 • విజయభారతి

కథ[మార్చు]

ఉద్యోగం, ఆదర్శాలు కల యువకుడు ప్రసాద్ తన స్నేహితుడు రమేష్‌ను చూడాలని వెడుతుంటే దారిలో కారు టైరు పంక్చరై, టైరు మార్చడానికి యత్నిస్తున్న గీత అనే అమ్మాయి కనిపించింది. సాయం చేశాడు. థాంక్స్ చెప్పకుండా కారులో తుర్రుమంది. కారు జాకీ తనదగ్గరే ఉండిపోయింది. ఆమె రూపం చూసి ముగ్ధుడైనాడు. పత్రికలో ఆమె ఫోటో చూసి అడ్రసు తెలుసుకుని ఆపేక్షగా ఆమె కోసం ఇంటికి వెడితే చీదరించుకుంది. ఆమెకోసం బెంగపెట్టుకున్నాడు. అనారోగ్యంతో డాక్టరు దగ్గరకెడితే ఆమె అక్కడ కనిపించింది. ఆమె ఇచ్చిన డబ్బుతోనే అతడు చదువుకున్నాడట. అక్కడ కూడా ఆమె నిరసించింది. మిత్రుడు రమేష్‌తో చెప్పాడు. బ్రోకరు జానీకి కబురంపాడు. ఆ రాత్రి రమేష్ బెడ్‌రూమ్‌లో బ్రాందీ తాగుతూ వివస్త్రయై పడుకుని ఉన్న ఆమెను చూడగానే రోతపుట్టింది. అదే తన జీవితమని చెప్పింది.

ఆమెను పెళ్ళి చేసుకుంటానన్నాడు. గీత మనస్సు చలించింది. తన బ్రతుకును ఏవగించుకొని సరేనంది. వివాహమైన పిదప మానసికంగా తనలో మార్పు వచ్చేవరకూ కొంచెం ఆగమంది. రమేష్‌కు సీరియస్‌గా ఉందన్న తంతి చూసి హైదరాబాద్ వెళ్ళాడు ప్రసాద్. ఒంటరితనం ఆమెకు భారమైంది. అస్వస్థతతో డాక్టరు దగ్గరకు వెడితే నువ్వు గర్భవతివి అన్నాడు. అయ్యో! ప్రసాద్‌ను మోసం చేశానే. ఇప్పుడీ గర్భానికి కారకులెవరో పాత విటుడై ఉండాలి అని బాధపడి అదేపనిగా త్రాగింది. తిరిగి ప్రసాద్ రాగానే చెప్పింది. ఆయన ఫరవాలేదన్నాడు. ఆ బిడ్డకు నువ్వు తల్లివైతే నేను తండ్రినన్నాడు. దేవుడవు నీవు. నీలాంటి వాళ్ళతో మనుషులు జీవించలేరు అంటూ వెళ్ళిపోయింది శాశ్వతంగా[2].


పాటలు[మార్చు]

 1. ఈనాడే తెలిసింది నా మనసే ఏమేమో తెలిపింది అడుసులోని కమలానికి - ఎస్. జానకి - రచన: డా. సినారె
 2. పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే దాగానే ( విషాదం ) - ఎస్.పి. బాలు - రచన: జి. కృష్ణమూర్తి
 3. పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే దాగానే ( సంతోషం ) - ఎస్.పి. బాలు - రచన: జి. కృష్ణమూర్తి

మూలాలు[మార్చు]

 1. http://ghantasalagalamrutamu.blogspot.in/2014/03/1973_5975.html[permanent dead link]
 2. సంపాదకుడు (25 December 1973). "చిత్రసమీక్ష - గీత". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 29 నవంబర్ 2020. Retrieved 4 March 2020. {{cite news}}: Check date values in: |archive-date= (help)