Jump to content

గుండా ప్రకాశ్ రావు

వికీపీడియా నుండి
గుండా ప్రకాశ్‌ రావు

పదవీ కాలం
2019 – 2021
ముందు నన్నపునేని నరేందర్‌

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
పూర్వ విద్యార్థి కాకతీయ విశ్వవిద్యాలయం

గుండా ప్రకాశ్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) మాజీ మేయర్‌. ఆయన వరంగల్ మహానగర పాలక సంస్థ కార్పొరేటర్‌గా నాలుగు సార్లు ఎన్నికయ్యాడు. [1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గుండా ప్రకాశ్‌రావు 1955లో వరంగల్ లో జన్మించాడు. ఆయన బీఎస్సీ వరకు చదివాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

గుండా ప్రకాశ్‌రావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1981-1986లో వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. వరంగల్ మహానగర పాలక సంస్థ ఏర్పడ్డాక 1995 నుండి 2000 వరకు కార్పొరేటర్‌గా పని చేశాడు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) , ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎ.పి.ఐ.ఐ.సి) డైరెక్టర్‌గా, చాంబర్ ఆఫ్‌ కామర్స్ కార్యదర్శిగా మూడు పర్యాయాలు, ఏపీ పోస్టల్ సర్వీస్ అడ్వయిజరీ మెంబర్‌గా , సౌత్ సెంట్రల్ రైల్వే రీఫార్మ్ కమిటీ అడ్వయిజరీ మెంబర్‌గా పని చేశాడు.

గుండా ప్రకాశ్‌రావు తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస పార్టీలో చేరి టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా రెండు పర్యాయాలు పని చేసి, 2016లో జరిగిన వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో 26వ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలిచాడు. అంతకు ముందు మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన నన్నపునేని నరేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందడం, 2018 డిసెంబర్ 24న మేయర్ పదవికి రాజీనామా చేయడంతో ఆయన 28 ఏప్రిల్ 2019న వరంగల్‌ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) మేయర్‌గా ఎన్నికయ్యాడు.[2][3]గుండా ప్రకాశ్‌రావు మేయర్‌గా 22నెలల పాటు బాధ్యతలు నిర్వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (28 April 2019). "వరంగల్‌ మేయర్‌గా ప్రకాశ్‌రావు". Archived from the original on 27 ఏప్రిల్ 2019. Retrieved 23 August 2021.
  2. Deccan Chronicle (28 April 2019). "Gunda Prakash Rao is Mayor of Warangal" (in ఇంగ్లీష్). Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
  3. The Hindu (27 April 2019). "Gunda Prakash is Warangal Mayor" (in Indian English). Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.