గుండిబైల్ సుందరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండిబైల్ సుందరం
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గుండిబైల్ రామ సుందరం
పుట్టిన తేదీ(1930-03-29)1930 మార్చి 29
ఉడుపి, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2010 జూన్ 20(2010-06-20) (వయసు 80)
ముంబై
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 81)1955 డిసెంబరు 16 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1955 డిసెంబరు 28 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 2 47
చేసిన పరుగులు 3 558
బ్యాటింగు సగటు 14.68
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 3* 52
వేసిన బంతులు 396 6,940
వికెట్లు 3 127
బౌలింగు సగటు 55.33 26.10
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 2/46 6/64
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 23/–
మూలం: CricInfo, 2022 నవంబరు 20

గుండిబైల్ రామ సుందరం (1930 మార్చి 29 - 2010 జూన్ 20) 1955లో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు.

GR సుందరం రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలరు, రైట్ హ్యాండ్ బ్యాటరు. అతను 1953లో ఆల్ఫ్ గోవర్ నడుపుతున్న క్రికెట్ స్కూల్‌లో శిక్షణ పొందాడు [1] అతను రంజీ మ్యాచ్‌లలో పాల్గొనే ముందు ఆ సంవత్సరం చివర్లో సిల్వర్ జూబ్లీ ఓవర్సీస్ క్రికెట్ జట్టుతో జరిగిన అనధికారిక 'టెస్ట్'లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.


అతని రెండు టెస్ట్ మ్యాచ్‌లు 1955-56లో న్యూజిలాండ్‌తో జరిగాయి. ఢిల్లీ టెస్టులో న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసినప్పుడు రెండు వికెట్లలో ఒకటి, తర్వాతి టెస్టులో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. కానీ అతనికంటే మెరుగైన బ్యాట్స్‌మన్లైన GS రాంచంద్, దత్తు ఫడ్కర్ వంటి మీడియం పేసర్లు ఉండటం వలన అతని అవకాశాలు రాలేదు.

సుందరం రంజీ ట్రోఫీలో బొంబాయి, రాజస్థాన్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అతని కుమారుడు ప్రదీప్ సుందరం 1980లలో రాజస్థాన్ తరఫున బౌలింగ్ ప్రారంభించాడు. ఒకసారి ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. [2]


సుందరం దక్షిణ కర్ణాటకలోని ఉడిపిలో బిల్లవ కుటుంబంలో జన్మించాడు. [3]

సుందరం 2010 జూన్ 20 న, 80వ ఏట, ముంబైలో మరణించాడు [4]

మూలాలు[మార్చు]

  1. Sujit Mukherjee, Playing for India, Orient Longman (1988), p. 61
  2. Rajasthan v Vidharbha, 1985-86
  3. Richard Cashman, Patrons, players, and the crowd, Orient Longman (1980), p.189. Cashman actually puts his mother tongue as 'Kannada(Tulu)'
  4. Former Test Cricketer, Mangalorean G R Sundaram Passes Away