గుణదల మేరీమాత ఉత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మేరీ మాత చర్చి ఒకటి.ఇక్కడ ఫ్రాన్స్ దేశంలోని లార్ధు నగరం చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహం ఉంది. ఇది గుహలో ఉంటుంది. విజయవాడ సమీపంలోని గుణదల చర్చిలో కూడా మేరీమాత విగ్రహం కొండ గుహలోనే ఉంటుంది. అందువల్ల ఈ చర్చి ప్రసిద్ధి చెందింది[1]. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9 ,10 ,11 తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి .ఈ ఉత్సవాల వెనక ఒక కథ ఉంది. శివారులో ఉన్న లార్ధునగర శివారులో ఉన్న కొండ దిగువకు వంట చెరుకు ఏరుకోవడానికి బెర్నడెట్‌ అనే బాలిక వెళ్ళింది.ఆమెకు మేరీమాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడింది.ఆ బాలిక ఇదే విషయం తల్లితోనూ ఇతరులతోనూ చెప్పింది. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. మేరీ మాత కనిపించిన ఫిబ్రవరి 11వ తేదీని గుర్తు చేసుకుంటూ, ప్రతి సంవత్సరం అక్కడ మేరీ మాత ఉత్సవాలు జరుగుతాయి. గుణదలలో కూడా 1924 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయి. 1924వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో " సెయింట్ జోసెఫ్ ఇన్ స్టిట్యూట్" అనే అనాధ శరణాలయం ఏర్పాటు చేసింది.ఇటలీకి చెందిన ఫాదర్ పి . ఆర్లాటి దానికి రెక్టార్ గానియమితుడయ్యాడు.ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై ఉన్న గుహలో మేరీమాత విగ్రహాన్ని నెలకొల్పాడు.అప్పటినుండి మేరీ మాత పూజలు అందుకుంటుంది. 1946లో అప్పటి చర్చి ఫాదర్ బియాంకి,ఇతరులను కలిసి నూతన మేరీ మాత , బలిపీఠాన్ని నిర్మించదలిచారు.అత్యవసరంగా ఫాదర్ బియ్యా0కి ఇటలీ వెళ్ళాడు.మిగిలిన వారు చర్చి నిర్మాణాన్ని కొనసాగించారు.అకస్మాత్తుగా వచ్చిన వరదలలో అప్పటివరకు సిద్ధమైన నిర్మాణాలన్నీ కొట్టుకుపోయాయి.తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఫాదర్ బియాంకి పెట్టలేనుండి తిరిగి వచ్చేనాటికి (1947)చర్చి నిర్మాణం పూర్తయింది.అప్పటినుండి ప్రతి శుక్ర , శని ఆదివారాల్లోనూ లోను ,క్రిస్మస్ ,జనవరి 1, గుడ్ ఫ్రైడే వంటి క్రైస్తవ పర్వదినాల్లోనూ ప్రజలు మేరీమాతను దర్శించుకుని దీవెనలు పొందుతున్నారు. భక్తులు తాకిడి పెరగడంతో గుణదల మేరీ మాత ఉత్సవాలు ఒకేరోజు కాకుండా మూడు రోజులు పాటు జరుపుకుంటారు[2].ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరవుతారు. కొండవద్ద సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహ నుండి కొండపై నిర్మించిన శిలువకు ఇప్పుడు మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు పవిత్రంగా భావించే వయాడోలరోసా అనే 14 స్థలాల విశిష్టతను తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు.నవంబర్ నుండి డిసెంబర్ వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనలకు రాష్ట్ర నలుమూలల నుండి క్రైస్తవ భక్తులు వేలాదిగా వస్తారు[3].

  1. "గుణదల మేరీ మాత ఉత్సవాలు". Sakshi. 2023-02-09. Retrieved 2023-09-08.
  2. "Gunadala Matha Shrine, Vijayawada (2023) - Images, Timings | Holidify". www.holidify.com. Retrieved 2023-09-08.
  3. Harish (2022-10-05). "మ‌తం ఎదైనా పూజ‌లు ఒక్కటే-బెజ‌వాడ‌ గుణ‌ద‌ల చాలా స్పెషల్". telugu.abplive.com. Retrieved 2023-09-08.