గురు హర్ క్రిషన్
గురు హర్ క్రిషన్ ਗੁਰੂ ਹਰਿਕ੍ਰਿਸ਼ਨ ਜੀ | |
---|---|
జననం | July 23, 1656 |
మరణం | March 30, 1664 | (aged 7)
ఇతర పేర్లు | ఎనిమిదవ గురువు The Child Guru |
క్రియాశీల సంవత్సరాలు | 1656–1664 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఢిల్లీలో రోగులకు సేవ చేయడం |
అంతకు ముందు వారు | గురు హర్ రాయ్ |
తరువాతివారు | గురు తేజ్ బహదూర్ |
తల్లిదండ్రులు | గురు హర్ రాయ్, మాతా క్రిషేన్ |
గురు హర్ క్రిషన్ (మూస:IPA-pa; 1656 జూలై 23 – 1664 మార్చి 30) పదిమంది సిక్ఖు గురువుల్లో ఎనిమిదో వారు. 5 సంవత్సరాల వయసులో 1661 అక్టోబరు 7న ఆయన తండ్రి గురు హర్ రాయ్ తర్వాత గురువు అయ్యారు. సిక్ఖు మత చరిత్రలోకెల్లా అతి చిన్న వయసులో గురువు అయింది హర్ క్రిషన్.[1] ఆయనను బాల గురువు అని కూడా అంటూ ఉంటారు.[1] ఆయన ఎనిమిది సంవత్సరాల వయసులో ఢిల్లీలో అంటువ్యాధి కారణంగా మరణించారు. ఆయన తండ్రి మావ గారైన గురు తేజ్ బహదూర్ సిక్ఖులకు తర్వాతి గురువు అయ్యారు.[1] కేవలం 2 సంవత్సరాల, 5 నెలల, 24 రోజుల పాటు మాత్రమే గురువుగా పనిచేశారు.
హర్ క్రిషన్ కిరాత్ పూర్ సాహిబ్, రూప్‌నగర్, పంజాబ్లో గురు హర్ రాయ్, కిషన్ దే (మాతా సులేఖ) దంపతులకు జన్మించారు.[2] అక్టోబరు 1661లో మరణించేందుకు ముందు గురు హర్ రాయ్ తన చిన్న కుమారుడు హర్ క్రిషన్ ను తర్వాతి గురువుగా ప్రతిపాదించారు. గురు హర్ రాయ్ తన పెద్ద కుమారుడు రామ్ రాయ్ ముఘల్ సామ్రాజ్యంతో రాజీపడుతున్నట్టు అనిపించడంతో చిన్న కుమారుడు హర్ క్రిషన్ ను ఎంచుకున్నారు.
చిత్ర మాలిక
[మార్చు]-
Gurudwara Bangla Sahib, where the Guru died
-
History of Gurudwara Panjokhra Sahib, Haryana
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 HS Singha (2009), The Encyclopedia of Sikhism, Hemkunt Press, ISBN 978-8170103011, pages 96-97
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-26. Retrieved 2020-01-07.
బయటి లింకులు
[మార్చు]- DiscoverSikhism - Sri Guru Harkrishan Sahib Archived 2016-04-17 at the Wayback Machine Sri Guru Harkrishan Sahib is the eighth of the Ten Sikh Gurus. Read about his life and stories here.
- Sikhs.org
- Sikh-History.com
- Shri Har Krishan Dhiaiyai Kirtan Shabad
- Sri Har Krishan Dhiaiyai - Video on Sri HarKrishan Sahib
- - Video on YouTube on Sri Guru HarKrishan
- srigurugranthsahib.org
- Learn more about Har Kishan