గులాం గౌస్ షేక్
గులాం గౌస్ షేక్ వ్రాసిన 35 నవలలు వివిధ పత్రికలలో ధారావాహికంగా ప్రచురితమై ఆ తరువాత నవలలుగా వెలువడ్డాయి. ఇతర భాషల్లో నుండి తెలుగులోకి అనువదించిన వీరి 40 కథలు, వందకు దాటిన కవితలు వివిధ పత్రికలలో చోటు చేసుకున్నాయి. పలు కవితలు, కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికల్లో స్థానం సంపాదించుకున్నాయి.
బాల్యము
[మార్చు]గులాం గౌస్ షేక్ కృష్ణా జిల్లా మైలవరం తాలూకా చీమలపాడులో 1955 జూన్ 10న జన్మించారు. వీరి తల్లితండ్రులు: హమాత్ బీబి, ముహమ్మద్ అబ్దుల్ ఖాదర్. ఇతని అసలు పేరు గులాం గౌస్ అయినప్పటికి 'శాతవాహన' 'ఏకెఏ' పేరుతో సుప్రసిద్దులు. చదువు: బి.ఏ (లిట్)., సాహిత్య విశారద. పిజి డిప్లోమా ఇన్ జర్నలిజం. ఉద్యోగం: 'ప్రభవ' మాసపత్రికతో ఆరంభమై 'సితార', 'ఉదయం' దినపత్రికలో పలు బాధ్యాతలు నిర్వహించారు.
రచనావ్యాసంగము
[మార్చు]1974లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో 'మానవత' కవిత రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభమైనది. అప్పటినుండి సుమారు వందకు పైగా కథానికలు, ఇతర భాషల్లో నుండి తెలుగులోకి అనువదించిన 40 కథలు, వందకు దాటిన కవితలు వివిధ పత్రికలలో చోటు చేసుకున్నాయి. పలు కవితలు, కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికల్లో స్థానం సంపాదించుకున్నాయి. 'స్పర్శ' (కవితా సంకలనం, 1985), ఒక యుద్ధ నదీ తీరాన (సుదీర్గ… కవితా కావ్యం, 2010) వెలువరించారు
నవలా రచయితగా
[మార్చు]ఇతను వ్రాసినవి యాభై నవలలు వెలువడ్డాయి. ఈ నవలల్లో 35 వివిధ పత్రికలలో ధారావాహికంగా ప్రచురితమై ఆ తరువాత నవలలుగా వెలువడ్డాయి. 15 నవలలు నేరుగా ప్రచురితం అయ్యాయి. ఈ నవలల్లో 'మహా యజ్ఞం, నిశ్శబ్ద యుద్ధం, వజ్ర సంకల్పం, దానవ రాజ్యం, అరుణతార, సుదర్శన చక్రం, కాలుతున్న పూలతోట, టిపూ సుల్తాన్, అంగార తల్పం, అగ్నిరథం, అనుక్షణం అంవేషణ' లాంటి నవలలు ప్రజాదరణ పొందాయి.
దూరదర్శన్ లో
[మార్చు]దూరదర్శన్‌లో ప్రసారమైన 1. మహా భారతం (1988-89), 2. రామాయణ్ (1989-90), 3.టిపూ సుల్తాన్ (1990-91), 4.పరమ వీర చక్రలాంటి మెగా సీరియల్స్ అనువాదాలు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. ప్రముఖ హిందీ రచయితలు రాసిన పలు నవలలను తెలుగులోకి అనువదించి 'చతుర' మాసపత్రికలో ధారావాహికంగా వెలువరించారు.
ఆకాశ వాణిలో
[మార్చు]ఆకాశవాణిలో వీరు వ్రాసిన కథలు, కథానికలు, నాటికలు, కవితలు ప్రసారం అయ్యాయి. 'స్పర్శ' (కవితా సంకలనం, 1985), ఒక యుద్ధ నదీ తీరాన (సుదీర్గ… కవితా కావ్యం, 2010) వెలువరించారు
చలనచిత్ర రంగంలో
[మార్చు]'నాగాస్త్రం, ఇరుగిల్లు-పొరుగిల్లు, విధాత, అర్చనా ఐఏయస్, ఆడపిల్ల' లాంటి సినిమాలకు కథను సమకూర్చడం మాత్రమే కాకుండా స్క్రీన్‌ప్లే కూడా అందించారు. 'వచ్చినవాడు సూర్యుడు' చిత్రానికి పాటలు రాశారు. బుల్లితెరకు వచ్చేసరికి జెమినీ టెలివిజన్‌లో ప్రసారమైన 'కలశం' సీరియల్‌కు కథను సమకూర్చడం కాకుండా మాటలు రాసి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. ఇది 2004- 2005లో నాలుగు నంది అవార్డులను అందుకుంది.
మూలాలు
[మార్చు]- గులాం గౌస్ షేక్
అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 70