గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్ ఇంగ్లిషు నుండి తెలుగు

గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్ [1] అనువాదానికి సహాయపడే వెబ్ ఆధారిత పరికరం. దీని ద్వారా వెబ్ పేజీలు పత్రాలు అనువాదం చేయవచ్చు. వాక్యభాగాలకు అనువాద కోశాన్ని, పదాలకు ప్రత్యేక కోశాన్ని జతచేయడం ద్వారా, కంప్యూటర్ అనువాదానికి సరిపోలినవి చూపుతూ సహాయపడుతుంది. పక్క బొమ్మలో చూపినట్లు కొన్ని పదాలను గుర్తించి వాటిని ప్రత్యేక గుర్తుల మధ్య పెట్టింది. వాటిని అనువాదం చేసినపుడు అవి అనువాద కోశంలో చేరి మరల ఆ పదాలు వచ్చినప్పుడు వాటి అనువాదాలు స్వయంచాలకంగా యివ్వబడతాయి.

గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్ ఐచ్ఛికాలు

దీనిని మెరుగుపరచడానికి, గూగుల్ సంస్థ ఇంగ్లిషు వికిలోని వ్యాసాలను భారతీయ మరియు యితర భాషలలోకి గుత్త పద్ధతి వాడుతున్నది.వికీ సందర్శకులలో 70 శాతం గూగుల్ అన్వేషణ ద్వారా వస్తున్నారు కాబట్టి, వికీని మెరుగుపరచితే, వాడుక పెరిగి పరోక్షంగా కంపెనీకి లాభముంటుందని గూగుల్ ఆలోచన.

ఇవీ చూడండి[మార్చు]

వనరులు[మార్చు]