స్థానికీకరణ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

స్థానికీకరణ అనగా ఇతర భాషలలోని పదాలను, చిహ్నాలను, లక్ష్య భాషకు అనువుగా అనువాదం లేక మార్చటం. ఇది కంప్యూటర్ రంగంలో వాడుతారు. దీనికి దగ్గర పదం, స్థానికత అనగా, కంప్యూటర్ ప్రోగ్రామ్ ను వాడుకరి ఇష్టానికి తగ్గట్టుగా మలచుకోవడం. భారత దేశంలో సంఖ్యలు రాయడానికి, అమెరికాలో సంఖ్యలు రాయడానికి ఎక్కడ కామాలు పెట్టాలో తేడా వుంటుంది. అలాగే అప్రమేయ భాషలు, క్యాలెండరు ఎలా చూపాలి అన్న విషయాలు. స్థానికీకరణ కొరకు లక్ష్య భాషలో నైపుణ్యం, అనువాద పటిమ, కంప్యూటర్ అనువర్తనాల వాడుక అనుభవం, లేక మూల భాష పదాల వాడుక సందర్భం అర్థం చేసుకోగల నేపుణ్యం కావాలి.

తోడ్పాటు జాలగూ‌‌ళ్లు[మార్చు]

  • తెలుగుపదం చర్చాగుంపు [1]
  • తెలుగుపదం.ఆర్గ్ [2]
  • ప్లైలీగాట్[3]
  • ఓపెన్ ట్రాన్ [4]
  • ట్రాన్సలేట్ వికీ[5]
  • లాంచ్పాడ్ :ఉబుంటుకి అనుబంధంగా స్థానికీకరణకు తోడ్పడేది[6]

ఉపకరణాలు[మార్చు]

లోకలైజ్[మార్చు]

లోకలైజ్ (Localize) [7] KDE సముదాయం వుత్పాదకత మరియు నాణ్యత లక్ష్యంగా అభివృద్ధి పరచిన కంప్యూటర్ సహాయ అనువాద వ్యవస్థ. ఇంతకుముందు కెబేబెల్ (Kbabel) అని పిలిచేవారు. దీనిలో అనువాద మెమరీ, పదకోశం, అనువాదాలు కలుపు (synchronization) శక్తి. సాఫ్ట్వేర్ స్థానికీకరణ లక్ష్యంగా రూపొందినా, బయటు పరివర్తిత వుపకరణాలతో సమాకలన వ్యవస్థ వున్నందున కార్యాలయ పత్రాలు అనువాదానికి కూడా వాడవచ్చు.

ఒమేగాటి[మార్చు]

కంప్యూటర్ సహాయ అనువాద వుపకరణాలలో ఒమేగాటి (OmegaT) [8] ఒకటి. స్థానికీకరణ ఫైళ్లే కాక, ఓపెన్ డాక్యుమెంట్ పత్రాలు, మైక్రోసాఫ్ట్ వర్డ్ పత్రాలు, ఓపెన్ ఎక్స్ఎమ్ఎల్ (OpenXML, డాక్బుక్ (DocBook) లేక సాధారణ పాఠ ఫైళ్లకు తోడ్పాటు యిస్తుంది. ఇది జావా ఆధారితం కనుక అన్ని కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థలలో పనిచేస్తుంది. అనువాదాలకు సహకారం కలిగివున్నది. దీనితో అనువాద కోశ అదానప్రదాన (TMX - Translation Memory Exchange) ఆకృతీకరణను వాడవచ్చు.వాక్య విడదీయటంలో సౌలభ్యం, పథకం మరియు ఉల్లేఖన అనువాదకోశాలలో వెతకటం, ఉజ్జాయింపు పోలిక, తెలివైన పథకాల ఫైళ్ల నిర్వర్తింపు, శాస్త్ర పదకోశం సౌలభ్యాలను కలిగివుంది. దీనిని వాడటానికి సులభమైన మార్గదర్శకాలు ఉన్నాయి.

ఇతరములు[మార్చు]

  • పొఎడిట్ (poedit) [9]
  • ఫర్టాల్ [10]
  • ట్రాన్స్లేట్ టూల్కిట్ మరియు పూటిల్ (translate toolkit & Pootle) [11] స్థానికీకరణ వుపకరణాలు చాలా వుపయుక్తమైనవి. లోకలైజ్ లాంటి మిగతా వుపకరణాలలో కూడా వీటిని వాడుతారు.

పదకోశ వుపకరణాలు[మార్చు]

ఎన్ట్రాన్స్[మార్చు]

ఎన్ట్రాన్స్ [12] స్థానికీకరణ వుపకరణం.

టర్మ్స్‌లేటర్[మార్చు]

టర్మ్స్‌లేటర్ [13] పారిభాషిక పదకోశం, 22 భారతీయ భాషలలో 27 లిపిలలో స్వేచ్ఛా మూల అనువర్తనాలలో వున్న అనువాదాలు చూపుతుంది. దీనిని ఆర్కెవిఎస్ రామన్ తయారుచేశాడు. ఇది వాడేఅనువర్తనాల పేర్లు

మైక్రోసాఫ్ట్ లాంగ్వేజి కలెక్షన్[మార్చు]

మైక్రోసాఫ్ట్ లాంగ్వేజి కలెక్షన్ [14]

ఇవీచూడండి[మార్చు]

మూలాలు[మార్చు]