గూడూరి ప్రవీణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూడూరి ప్రవీణ్

తెలంగాణ రాష్ట్ర పవర్‌లూం, టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌
పదవీ కాలం
2022 సెప్టెంబర్ 13 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1964 ఆగస్టు 27
సుభాష్‌నగర్‌, సిరిసిల్ల
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాజయ్య, రుకుంబాయి
జీవిత భాగస్వామి మంజుల
సంతానం ప్రత్యూష , మానస్‌
నివాసం సుభాష్‌నగర్‌, సిరిసిల్ల

గూడూరి ప్రవీణ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 సెప్టెంబర్ 13న తెలంగాణ పవర్ లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమితులయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గూడూరి ప్రవీణ్ తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో రాజయ్య, రుకుంబాయి దంపతులకు 1964 ఆగస్టు 27న జన్మించాడు. ఆయన పొలిటికల్ సైన్స్ లో బి.కామ్ పూర్తి చేసి ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ., శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎం.ఫిల్‌ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

గూడూరి ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 వరకు పార్టీలోవివిధ హోదాల్లో పని చేసి తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2000 నుండి 2005 వరకు సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ప్రవీణ్ 2007 నుండి 2010 వరకు కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ, రాజన్న సిరిసిల్ల డైరెక్టర్ & సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ(సెస్‌) వైస్ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.[3]

గూడూరి ప్రవీణ్ 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ పార్టీ) రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడై, మంచిర్యాల జిల్లా పార్టీ ఇంచార్జిగా పనిచేశాడు. ఆయన 2022లో సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ(సెస్‌) ఛైర్మన్‌గా నియమితులయ్యాడు, అయితే హైకోర్టు స్టే విధించింది. ప్రవీణ్ 2022 సెప్టెంబర్ 13న తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్‌కు (టీపీటీడీసీఎల్‌) చైర్మన్‌గా నియమితుడై[4] సెప్టెంబర్ 19న బాధ్యతలు చేపట్టాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (14 September 2022). "పద్మశాలీలకు పట్టం". Archived from the original on 14 September 2022. Retrieved 14 September 2022.
  2. Eenadu (14 September 2022). "నాలుగేళ్ల నిరీక్షణకు తెర". Archived from the original on 14 September 2022. Retrieved 14 September 2022.
  3. Andhra Jyothy (14 September 2022). "సిరిసిల్ల జిల్లాకు కార్పొరేషన్‌ పదవి" (in ఇంగ్లీష్). Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
  4. Sakshi (14 September 2022). "టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రవీణ్‌". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
  5. Namasthe Telangana (20 September 2022). "హ్యాండ్లూం చైర్మన్‌గా ప్రవీణ్‌ బాధ్యతలు". Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.
  6. Namasthe Telangana (19 September 2022). "చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి : గూడూరి ప్రవీణ్‌". Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.