గెణుపు
స్వరూపం
గెణుపు అనగా కణుపుకి కణుపుకి ఉన్న మధ్య భాగం. గెణుపును ఇంగ్లీషులో internodes (కణుపు మధ్యమాలు) అంటారు. సాధారణంగా కణుపు నుంచి మొక్క మొలకెత్తగల మొక్కలకి సంబంధించిన వాటినే గెణుపుగా వ్యవహరిస్తారు. చెరకు నాటేవారు చెరకు చెట్టును గెణుపులగా తెగొట్టి భూమిలో అడ్డంగా నాటుతారు. గెణుపుకి ఇరువైపుల ఉన్న కణుపుల నుంచి చెరకు మొక్కలు మొలుస్తాయి[1]. చెరకు వేసిన పొలంలో చెరకు కొట్టినప్పుడు భూమిలో మిగిలిన చెరకు గెణుపుల యొక్క కణుపుల నుంచి కొత్త చెరకు మొలకలు మొలుస్తాయి.
మొక్క కాండం కణుపు, గెణుపు లతో కూడి ఉంటుంది.[2]
గెణుపులు నాటేముందు
[మార్చు]- చెరకు గెణుపులను నాటేముందు గెణుపులలోని శిలీంద్రాన్ని తొలగించేందుకు చెరకు గెణుపులను కొంత సమయం తగిన మోతాదు నీటితో కలిపిన పురుగుల మందులో ముంచి ఉంచుతారు.
మూలాలు
[మార్చు]- ↑ "SS-AGR-234/SC034: Sugarcane Botany: A Brief View". Ask IFAS - Powered by EDIS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-06-21.
- ↑ Britannica Lessons Class VI Science The Living World. Popular Prakashan. 2002. ISBN 9788171549719, 8171549713.
{{cite book}}
: Check|isbn=
value: invalid character (help)