గెలీలియో మధ్య వేలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాని గాజు గుడ్డు ఎన్‌క్లోజర్‌లో గెలీలియో మధ్య వేలు

ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ (1564-1642) కుడి చేతి మధ్య వేలు ఇటలీలో ఫ్లోరెన్స్‌లోని మ్యూజియో గెలీలియో సేకరణలో ఒక మతేతర అవశేషం. అతని మరణం తర్వాత అతని శరీరం నుండి వేలును తొలగించి, పూతపూసిన గాజు గుడ్డులో భద్రపరచారు.

1737 లో, గెలీలియో మరణించిన 95 సంవత్సరాల తర్వాత, అతని భౌతిక అవశేషాలను ఫ్లోరెన్స్‌లోని బసిలికా డి శాంటా క్రోస్‌లోని సమాధి లోకి మార్చారు. పురాతన కాలం నాటి ఆంటోన్ ఫ్రాన్సిస్కో గోరీ, శరీర నిర్మాణ శాస్త్రజ్ఞుడు ఆంటోనియో కొచ్చి, ఇటాలియన్ మార్క్విస్ విన్సెంజియో కప్పోనీలు గెలీలియో కుడి చేతి వేలును, ఒక వెన్నుపూస, చూపుడు వేలు, బొటనవేలును, ఒక పంటినీ తొలగించారు. మధ్య వేలిని ఏంజెలో మరియా బాండినికి పంపించగా అతను దానిని లారెన్షియన్ లైబ్రరీలో ప్రదర్శించాడు. 1841 లో ఆ వేలిని లా స్పెకోలాలోని ట్రిబ్యూన్ ఆఫ్ గెలీలియోకి తరలించారు. 1927 లో దాన్ని ఇన్‌స్టిట్యూట్ అండ్ మ్యూజియం ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ సైన్స్‌కు పంపించారు.

నేపథ్యం

[మార్చు]

ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1642 లో మరణించాడు. అతని అవశేషాలను తన తండ్రి విన్సెంజో గెలీలీతో పాటు బాసిలికా డి శాంటా క్రోస్‌కు చెందాలని అతని వీలునామాలో పేర్కొన్నాడు.[1] ఆ సమయంలో మతవిశ్వాశాలకు వ్యతిరేకంగా పరిగణించే కోపర్నికన్ సూర్యకేంద్రత్వంపై అతని అభిప్రాయాల కారణంగా, కాథలిక్ చర్చి అధికారులు అతనిని పవిత్రమైన ప్రాతిపదికన ఖననం చేయకూడదనుకున్నారు..[a][3] కార్డినల్ ఫ్రాన్సిస్కో బార్బెరిని ఈ విషయంపై నిర్ణయం చెబుతూ, అతని సమాధి వలన ప్రజలు అపవాదుకు గురవుతారని రాశాడు.[1] అతని అవశేషాలను సెయింట్స్ కోసిమో, డామియానో చాపెల్ సమీపంలో ఒక చిన్న ఆవరణలో ఉంచారు.

1688 లో గెలీలియో శిష్యుడు విన్సెంజో వివియాని, గెలీలియో కోసం సమాధిని స్థాపించడానికి తన సంపదను ఉపయోగించాలని తన వీలునామాలో పేర్కొన్నాడు.[4] వివియాని జీవించి ఉండగా, గెలీలియోకు సమాధి నిర్మించలేదు - మొదట కాథలిక్ చర్చి వ్యతిరేకత, తరువాత వివియాని మేనల్లుడూ, వారసుడూ అయిన అబాట్ జాకోపో పంజాని చేసిన "సాచివేత" కారణంగా ఇది ఆలస్యమైంది.

శవం నుండి వేళ్ళను తీయడం

[మార్చు]

గెలీలియో మరణించిన తొంభై ఐదు సంవత్సరాల తర్వాత, 1737 మార్చి 12 న, అతని శరీర అవశేషాలను శాంటా క్రోస్ బెల్ టవర్ క్రింద ఉన్న పెట్టె నుండి చర్చి లోపల ఉన్న మైఖేలాంజెలో యొక్క వేళ్లు, ఎముకలకు సమీపంలోని స్మారక సమాధికి తరలించారు. ఒక సెయింట్ అవశేషాన్ని ఎలా తీసుకువెళ్తారో అలాగే గెలీలియో అవశేషాలను కూడా అతని మతవ్యతిరేకి-సమాధి నుండి బసిలికా డి శాంటా క్రోస్ లోని సమాధికి తీసుకెళ్లారు.[5]

వృక్షశాస్త్రజ్ఞుడు గియోవన్నీ టార్గియోని టోజెట్టి ఈ బదిలీకి ఒక కత్తిని తీసుకుని మరీ హాజరయ్యాడు. అనాటమిస్ట్ ఆంటోనియో కొచ్చి, ఇటాలియన్ మార్క్విస్ విన్సెంజియో కపోనీ, పురాతనమైన అంటోన్ ఫ్రాన్సిస్కో గోరీ లు ఆ కత్తిని ఉపయోగించి గెలీలియో మృతదేహం నుండి మధ్య వేలును,[1] అతని బొటనవేలు, చూపుడు వేలు, ఒక దంతాన్నీ అతని ఐదవ కటి వెన్నుపూసనూ తొలగించారు.[6] దంతం, చూపుడు వేలు, బొటనవేలు లను గాజు పాత్రలో[1] ఉంచారు. 20 వ శతాబ్దం ప్రారంభం వరకు అవి కాప్పోని కుటుంబ సంరక్షణలో ఉన్నాయి.[7][8] రెండు వేళ్లను అవశేషాలుగా ఎందుకు తీసుకున్నారో వివరిస్తూ కాప్పోని, "గెలీలియో వాటితో చాలా అందమైన విషయాలు రాశాడు" అని వివరించాడంటూ టోజెట్టి రాశాడు.[1] వెన్నుపూసను 1823 లో డొమెనికో థీన్ పడువా విశ్వవిద్యాలయానికి దానం చేశాడు.[9]

ప్రదర్శన చరిత్ర

[మార్చు]
మ్యూజియో గెలీలియో వద్ద ప్రదర్శనలో గెలీలియో మధ్య, చూపుడు వేళ్లతో ఉన్న కేస్

మధ్య వేలును లారెన్షియన్ లైబ్రరీకి చెందిన ఏంజెలో మరియా బాండిని కొనుగోలు చేసి, అక్కడ ప్రదర్శించాడు. 1841 లో గెలీలియో మెడిసి-లోరైన్ పరికరాలతో పాటు వేలిని ఫిజిక్స్ అండ్ నేచర్ మ్యూజియం (ఇప్పుడు లా స్పెకోలా ) వద్ద ఉన్న ట్రిబ్యూన్ ఆఫ్ గెలీలియోకి తరలించారు. 1927 లో దీన్ని ఇన్‌స్టిట్యూట్ అండ్ మ్యూజియం ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ సైన్స్ (మ్యూజియో డి స్టోరియా డెల్లా సైన్జా) లోకి చేర్చారు. మ్యూజియం ఇన్వెంటరీలో ఈ వేలును తొలుత అతని ఎడమ చూపుడు వేలుగా పేర్కొన్నారు.[10] అయితే ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో లియోన్సిని, ఇది గెలీలియో కుడి చేతి మధ్య వేలు అని సూచించే ఫుట్‌నోట్‌ను జోడించాడు.

చివరికి దీన్ని మ్యూజియో గెలీలియో సేకరణలో చేర్చారు. వేలు ఒక స్థూపాకార పాలరాయి బేస్ పైన గుడ్డు ఆకారపు గాజు పాత్రలో ఉంచారు. దానిపై ఖగోళ శాస్త్రవేత్త తోమాసో పెరెల్లి రాసిన స్మారక శాసనం ఉంది. మ్యూజియం ప్రకారం, గెలీలియో మధ్య వేలు "గెలీలియోను సైన్స్ వీరుడిగా, అమరవీరుడుగా స్మరించుకోడాన్ని సూచిస్తుంది".[5] గెలీలియో వాడిన టెలిస్కోపు లోని ఆబ్జెక్ట్ లెన్స్‌తో పాటు ఈ వేలును ప్రదర్శిస్తారు.

అమెరికన్ జర్నలిస్ట్ నినో లో బెల్లో 1960 లలో గెలీలియో వేలిని గుర్తించడానికి చేసిన ప్రయత్నాల గురించి 1986 లో రాశాడు. నేషనల్ లైబ్రరీ మ్యూజియం ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ సైన్స్‌కు ఇవ్వడానికి ముందు అది చాలా సంవత్సరాల పాటు అక్కడ ఉండేదని నేషనల్ లైబ్రరీలోని ఒక ఉద్యోగి చెప్పినట్లు అతను రాసాడు.[11]

బాసిలికా డి శాంటా క్రోస్ వద్ద గెలీలియో సమాధి, అతని మిగిలిన అవశేషాలు ఉన్నాయి.

గెలీలియో మధ్య వేలు మతాతీతమైన అవశేషానికి అరుదైన ఉదాహరణ. సాధారణంగా కాథలిక్ చర్చిలోని సాధువుల శరీర భాగాలను భద్రపరచడం జరుగుతూ ఉంటుంది.[12] మ్యూజియం ఆఫ్ సైన్స్‌ ఆ వేలి పట్ల గర్విస్తుందని చెబుతూ బ్రిటిషు కళా విమర్శకుడు జూలియన్ స్పాల్డింగ్ ఇలా రాసాడు: "దీన్ని చూడటానికి ప్రత్యేకంగా వెళ్లమని నేను చెప్పను. అసలు గెలీలియో వేలిని చూడటం ఏంటంట?"

ఇటలీలో, గెలీలియో మధ్య వేలును తమ దేశపు ఆస్తిగా పరిగణిస్తారు.[1]

గెలీలియో ఇతర శరీర భాగాలు

[మార్చు]

గెలీలియో చూపుడు వేలు, అతని కుడి చేతి బొటనవేలు, ఒక దంతం లను ఓ గాజు కూజాలో పెట్టి సీలు వేసారు. 1905 తర్వాత కొంత కాలానికి అవి పోయాయి. 2009 లో మళ్ళీ కనిపించాయి.[13] మిగిలిన రెండు వేళ్లు ఫ్లోరెన్స్‌లోని లుయిగి రోసెల్లీ డెల్ టర్కోలో ఒక శేషవస్త్రంలో భద్రపరచారని తెలిసినట్లు 1951 లో రూఫస్ సూటర్ రాశాడు. 2009 లో అవి వేలానికి వచ్చినపుడు వాటిని మ్యూజియం లోకి తరలించారు.[13] ఆ అవశేషాల ప్రామాణికతను ఫోరెన్సికల్‌గా నిర్ధారించడానికి మ్యూజియం వారు DNA పరీక్ష చేయించారు.[1] గెలీలియో వెన్నుపూసలలో ఒకటి పడువా విశ్వవిద్యాలయంలో ఉంది.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. The church did not admit that it erred in condemning Galileo until 1992.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Gordon, Bonnie (2023). "Organoscope: Telescoping Sound". Voice Machines: The Castrato, the Cat Piano, and Other Strange Sounds. pp. 98–112. doi:10.7208/chicago/9780226825151.001.0001. ISBN 978-0-226-82514-4. Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  2. "Vatican Science Panel Told By Pope: Galileo Was Right". The New York Times. Reuters. 1 November 1992. Archived from the original on 22 June 2020. Retrieved 6 May 2024.
  3. "Galileo's lost fingers displayed in Florence". CBC News. 8 June 2010. Archived from the original on 14 August 2022. Retrieved 6 May 2024.
  4. Bredekamp, Horst (1 April 2019). Galileo's Thinking Hand: Mannerism, Anti-Mannerism and the Virtue of Drawing in the Foundation of Early Modern Science (in ఇంగ్లీష్). Walter de Gruyter GmbH & Co KG. pp. 27–28. ISBN 978-3-11-053921-9. Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  5. 5.0 5.1 "Galileo's Finger" (in ఇంగ్లీష్). NASA Science. 9 July 1996. Archived from the original on 8 March 2024. Retrieved 6 May 2024.
  6. 6.0 6.1 "Galileo's fingers to be displayed in Florence science museum". The Guardian. AP. 8 June 2010. Archived from the original on 19 April 2024. Retrieved 6 May 2024.
  7. "New relics of Galileo found: two fingers and a tooth". Museo Galileo. Archived from the original on 6 August 2023. Retrieved 13 December 2023.
  8. "Museum: Galileo's fingers, tooth are found". Phys.org (in ఇంగ్లీష్). AP. 21 November 2009. Archived from the original on 31 May 2023. Retrieved 6 May 2024.
  9. "A Reproduction of Galileo's Vertebra held at the University of Padua". Università degli studi di Padova (in ఇటాలియన్). 17 November 2022. Archived from the original on 7 June 2023. Retrieved 6 May 2024.
  10. (1951). "Some Relics of Galileo in Florence".
  11. Lo Bello, Nino (26 January 1986). "Search for Galileo's Finger Leads Way to Sights Far Beyond a Package Tour". Chicago Tribune. Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  12. Gattei, Stefano (2016). "From Banned Mortal Remains to the Worshipped Relics of a Martyr of Science". Savant Relics: Brains and Remains of Scientists. Science History Publications. p. 82.
  13. 13.0 13.1 Greene, Richard Allen (23 November 2009). "Galileo's missing fingers found in jar". CNN (in ఇంగ్లీష్). Archived from the original on 23 November 2023. Retrieved 6 May 2024.