గొలగమూడి
Jump to navigation
Jump to search
గొలగమూడి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | వెంకటాచలము |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524321 |
ఎస్.టి.డి కోడ్ | 0861 |
గొలగమూడి , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలము మండలానికి చెందిన [[గ్రామము.[1]]]. పిన్ కోడ్ నం. 524 321., ఎస్.టి.డి.కోడ్ = 0861.
- గొలగమూడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక పుణ్య క్షేత్రము. ఇది నెల్లూరు నుండి సుమారు 15 కి.మి దూరంలో ఉన్నది. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న దైవము.
ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి మహాసమాధి చెందారు. ఆయనను *వెంకయ్య స్వామి అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి.
- ఈ గ్రామములో శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంఉన్నది.