Jump to content

గొలుసుకట్టు చెరువు

వికీపీడియా నుండి
పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో తామర పూలతో నిండి వున్న చెరువు

గొలుసుకట్టు చెరువుల నిర్మాణలో నీటివాలు బాగా ఉన్న చోటు, ప్రవాహ దిశ, నీరు సహజంగా నిలిచే ప్రాంతాలను గుర్తించి ఆనాడే పలు చెరువులను నిర్మించాలి . ఎగువన ఉన్న చెరువు నిండాక అందులోని అదనపు నీరు అలుగుపైగా పారి వేరే చెరువుకు చేరేలా చేయాలి . దిగువ భాగంలో ఇంకొక చెరువు నిర్మాణం జరిపాలి . దానికింద మరి కొన్ని చెరువులను, కుంటలను నిర్మించి కాలువల ద్వారా అనుసంధానించాలి . ఇలా ఎన్నో చెరువులు వివిధ మట్టాల్లో ఒకే శ్రేణిలో నిర్మితమయితే . వర్షాకాలంలో చెరువులోకి చేరిన నీరు నిండగానే, దాని నుంచి ప్రవహించే మిగులునీరు దిగువన ఉన్న చెరువును నింపుతుంది . అలా వరుసలోని చెరువులన్నీ నిండుతాయి . చెరువుల నుంచి నీటిని తూముల ద్వారా పంటల సాగుకు వదిలవచ్చు రుతుపవనాల కాలంలో కురిసిన వర్షంమీదే చెరువులు ఆధారపడి ఉంటాయి. మరికొన్ని చెరువులు అడుగున వూట బావుల నుంచి వచ్చిన నీటితో నిండటానికి అవకాశం వున్నది ఇలా ప్రతి చెరువుకు పరీవాహక ప్రాంతంతోపాటు ఆయకట్టు స్థిరీకరణ జరపవచ్చు . ఎగువ చెరువుల నుంచి దిగువ చెరువులకు నీరు ప్రవహించడం వల్ల, మొత్తం పరీవాహక ప్రాంతంలో నేలలో తేమ నిలిచి ఉంటుంది పంటల సాగుకు అది అనువు.