గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్
గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ | |||
పదవీ కాలం 2 మే 2021 – 2026 | |||
ముందు | మల్లాది కృష్ణారావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | యానాం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 10/05/1992 కాకినాడ | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర అభ్యర్థి | ||
నివాసం | యానాం, పుదుచ్చేరి,భారతదేశం |
గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాంకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జరిగిన ఎన్నికల్లో యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 655 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]
రాజకీయ నేపథ్యం
[మార్చు]గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తండ్రి గంగాధర ప్రతాప్ 2000 యానాం ఉప ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పి.షణ్ముగంపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అనంతరం 2001లో ఎమ్మెల్యే ఎన్నికల్లో మల్లాడికృష్ణారావు గారి చేతిలో ఓటమి పాలయ్యాడు. యానాంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న గంగాధర ప్రతాప్ 2004లో గుండెపోటుతో చనిపోయాడు.
గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తండ్రి మరణాంతరం రాజకీయాల పట్ల ఆసక్తితో రాజకీయాలకు వచ్చాడు. శ్రీనివాస్ అశోక్ ‘నమస్తే యానాం’ అంటూ 2021 జనవరిలో రాజకీయ ఆరంగేట్రం చేశాడు. యానాం నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ అక్కడవారినీ కలుసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యాడు.
గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యానాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై 655 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఏప్రిల్ 6న ఎన్నికల్లో మొత్తం 34927 ఓట్లు పాలవగా అశోక్ కు 17132 రాగా, రంగస్వామికి 16477ఓట్లు వచ్చాయి.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (3 May 2021). "Yanam Election: యానాం ఎన్నికల్లో దూసుకొచ్చిన యువ కెరటం..మూడంటే మూడు నెలల ప్రచారం..సీనియర్ నేతకు చుక్కలు చూపించిన వైనం - Yanam Election". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ETV Bharat News (3 May 2021). "యానాంలో మల్లాడికి ఎదురుదెబ్బ.. యువ కెరటం విజయ బావుటా!" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
- ↑ Eenadu (3 May 2021). "యానాంలో సంచలనం". www.eenadu.net. Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
- ↑ ఆంధ్రజ్యోతి (3 May 2021). "అశోక్‌కి పట్టం". www.andhrajyothy.com. Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.