మల్లాది కృష్ణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లాడి కృష్ణారావు
నియోజకవర్గంయానాం
ఆరోగ్య శాఖా మంత్రి
వ్యక్తిగత వివరాలు
జననం (1964-06-06) 1964 జూన్ 6 (వయసు 60)
దరియాలతిప్ప గ్రామం, యానాం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు, నమోదు రాజ్యం కాంగ్రెస్
జీవిత భాగస్వామిఉదయ లక్ష్మి
సంతానంమల్లాడి రఘువంశీ
నివాసంయానాం

మల్లాడి కృష్ణారావు (జననం 1964 జూన్ 6) కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాంకు చెందిన రాజకీయ నాయకుడు. అతను యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 25 సం.లు ఎమ్మెల్యేగా పనిచేసాడు. అతనికి మూడు సార్లు ఉత్తమ ఎమ్మెల్యే పురస్కారం లభించింది. పుదుచ్చేరి లోని తమిళ శాసనసభ్యులు ఎవ్వరి నుంచి దీనికి ఎటువంటి అభ్యంతరం రాలేదు.

జననం, విద్య, రాజకీయ పదవులు

[మార్చు]
మల్లాది కృష్ణారావు

మల్లాడి కృష్ణారావు గారు 1964 జూన్ 6న యానాంలో, దరియాలతిప్ప గ్రామంలో జన్మించారు. వీరు అగ్నికులక్షత్రియ సామజికవర్గానికి చెందినవారు, రఘుకుల గోత్రిజ్ఞులు. ఒక సామాజిక కార్యకర్త, అఖిల భారత కాంగ్రెస్ రాజకీయ నాయకుడు. పుదుచ్చేరి లోని యానాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే. 2016-2021 కాలంలో పుదుచ్చేరి రాష్ట్ర ఆరోగ్య, పర్యాటక, పిడబ్ల్యుడి (నీటిపారుదల), పౌర విమానయానం, క్రీడలు & మత్స్యపోషణ, కళలు & సాంస్కృతిక శాఖా మంత్రి.[1] ఎమ్మెల్యే ఎన్నికలలో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచాడు. యానాం చరిత్రలోనే అత్యధిక మెజారిటీ సాధించాడు. 2006 లో పుదుచ్చేరి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మొదటి తెలుగు పౌరుడు.

మల్లాడి కృష్ణారావు 12 వ తరగతిలో తన విద్యను ముగించాడు. సామాజిక కార్యక్రమాల్లో, రాజకీయాల్లో రాణించాడు. ఆయనకు మూడుసార్లు ఉత్తమ ఎమ్మెల్యే పురస్కారం లభించింది. పుదుచ్చేరి లోని శాసనసభ సభ్యులెవ్వరి నుండి దీనికి ఎటువంటి అభ్యంతరమూ రాలేదు. 1996 నుండి అతడి పదవీ కాలంలో యానాంలో భారీ అభివృద్ధి జరిగింది. మల్లాడి కృష్ణారావు గారి పరిపాలనలో యానాం పుదుచ్చేరిలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా నిలిచింది. పుదుచ్చేరి రాజకీయాలతో పాటు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు నాయకత్వం వహించిన ముఖ్య సభ్యులలో మల్లాడి ఒకరు.[2]

సామాజిక సేవ

[మార్చు]

మల్లాడి కృష్ణారావు 26-28 సంవత్సరాల వయస్సులో (1990-92) ఇళ్లు లేని ప్రజలకు లక్షల రూపాయల విలువ ఉండే తన సొంత భూములను విరాళంగా ఇచ్చి కొత్త హౌసింగ్ కాలనీలను స్థాపించాడు.

28-29 సంవత్సరాల వయస్సులో (1992-93), అతను ఓల్డ్ రాజీవ్ నగర్ అగ్నిప్రమాద బాధితులకు సహాయంగా మొత్తం కాలనీని పునర్నిర్మించాడు.

29-30 సంవత్సరాల వయస్సులో (1993-94), అతను చలో పాండిచేరి ప్రచారం యొక్క ఆందోళనను ప్రారంభించి పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంపై దృష్టి పెట్టాడు, 80 మంది మహిళా వాలంటీర్లతో సహా వందలాది మంది వాలంటీర్లతో 5 రోజులు ప్రయాణించి యానాం నుండి 850 కి.మీ. దూరం లోని పుదుచ్చేరికి వెళ్ళాడు. సారాయి అమ్మకానికి వ్యతిరేకంగా మహిళలతో ఉద్యమాన్ని నిర్మించాడు. మల్లాడి కృష్ణారావు చేసిన కృషి కారణంగా, సారాయి షాపుల వేలం ఇప్పటి వరకు యానాంలో జరగలేదు.

యానం ఓల్డ్ ఏజ్ హోమ్:

శ్రీ మల్లాడి కృష్ణారావు - వ్యవస్థాపకుడు & చైర్మన్.

మల్లాడి కృష్ణారావు గారు 1997 మార్చి 1 న, యానాం వృద్ధాప్య గృహాన్ని ఎవరూ లేని పేద వృద్ధుల కోసం,  వసతి, ప్రేమ, ఆప్యాయత, ఆరోగ్యం వంటి ఉచిత సౌకర్యాలు. యానాం ప్రజలకు ఉచిత ఆహారము అందించు సదుద్దేశ్యముతో స్థాపించారు.

యానాం చిన్నారుల ఆనంద నిలయం:

పేద, అనాథబాలబాలిక విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, ప్రేమ, ఆప్యాయత, ఆరోగ్యం వంటి ఉచిత సౌకర్యాలు.

2011 నవంబరు 14 న న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మల్లాడి కృష్ణారావు గారికి "2011 సంవత్సరంలో శిశు సంక్షేమానికి జాతీయ అవార్డు", నగదు బహుమతిని భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముకర్జీ గారు అందజేశారు.

యానాం రక్తనిధి కేంద్రం

యానాం బ్లడ్ బ్యాంక్ దానం చేసిన రక్తాన్ని నిల్వ చేసి పంపిణీ చేసే ప్రదేశంగా ఉంది, ఈ రోజుల్లో చాలావరకు బ్లడ్ బ్యాంకింగ్‌లో పాల్గొన్నవారందరినీ, సంభావ్య రక్తదాతలను నియమించడం, పరీక్షించడం నుండి, అవసరమైనప్పుడు వారిని పిలవడం, వేరు వేరు వేరుచేయడం వంటి చూసుకుంటాయి. మొత్తం రక్తం యొక్క భాగాలు (ఎర్ర రక్తకణాలు, ప్లాస్మా లేదా గడ్డకట్టే కారకాలు, అల్భూమిన్, సి 1-ఎస్టేరేస్ ఇన్హిబిటర్స్ మొదలైన ప్లాస్మా యొక్క విభిన్న భాగాలలోకి, వాటిని అవసరమైన వారికి నిల్వ చేసి పంపిణీ చేస్తారు), చాలామంది రక్తమార్పిడి సంబంధిత పరిశోధనలు చేస్తున్నారు. యానాం బ్లడ్ బ్యాంక్చాల మంది ప్రాణాలు రక్షించారు.

యానాం ఐ బ్యాంక్:

2010 మార్చి 3 న న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మల్లాడి కృష్ణారావు గారికి [1] సంవత్సరానికి యానాం ప్రాంతానికి "ఉత్తమ పౌర నిర్వహణ అవార్డు"ను భారతదేశ ఉప రాష్ట్రపతి M.హమీద్ అన్సరి అందజేశారు.

ఉచిత ఆహారం:

యానాంలోని ప్రజలకు వరదలు, తుఫానులు, కరోనా కష్టకాలంలో కరోనా బాధితులకు పౌష్టిక ఆహారం అందజేస్తున్న యానాం ఓల్డ్ ఏజ్ హోమ్.

మానవ సేవయే మాధవ సేవ

యానాం ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారా ప్రతిరోజు కరోనా పాజిటివ్ బాధితులకు (హోమ్ ఐసోలేషన్ లో ఉన్న) వారి కుటుంబం సభ్యులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సాయంత్రం బ్రేక్ భోజనం, కరోనా మొదటి వేవ్ మాదిరిగానే ప్రతి సంవత్సరం అందిస్తున్నారు.

శుభ్రత పరిశుభ్రత:

యానాం ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారా యానాం ప్రజల స్వచ్ఛంధ సేవా సంస్థకి చెందిన  కార్మికులతో యానాం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా యానాంతో పాటు శివారు గ్రామంలలో కూడా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సేవలు (శుభ్రత పరిశుభ్రత క్లీనింగ్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యానం నియోజకవర్గ ప్రజల సంక్షేమ, ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్య సేవలను కొనసాగించడం జరుగుతుందని తెలియజేసారు.

రాజకీయ జీవితం

[మార్చు]

మల్లాడి కృష్ణారావును 1996 నుండి యానాం ప్రజలు తమ ప్రతినిధిగా (ఎమ్మెల్యే) ఎన్నుకున్నారు. ఈ రోజు వరకు ఆయన ఈ పదవిని నిరంతరం నిర్వహిస్తున్నారు. 2006 లో పర్యాటక, స్థానిక పరిపాలన, పౌర విమానయానం, గ్రామీణాభివృద్ధి, జిల్లా, గ్రామీణాభివృద్ధి శాఖలను, 2008 లో రెండవసారి రెవెన్యూ, ఎక్సైజ్, ఫిషరీస్, పర్యాటకం, పౌర విమానయాన మంత్రిగా చేసాడు.

వైద్యశాఖమంత్రిగా

మల్లాడి కృష్ణారావు గారు 2016-2021 పుదుచ్చేరిలో వైద్యశాఖ మంత్రిగా పనిచేసారు. ప్రభుత్వ దినం 1వ జాతీయ ప్రకృతివైద్యోత్సవం సందర్భంగా యానాం ప్రజలకు రెండు కొత్త ఆయుర్వేద & హోమియోపతి ఆసుపత్రులను ప్రారంభించిన పుదుచ్చేరి వైద్య శాఖ మంత్రులు మల్లాడి కృష్ణారావు. యానాం ప్రభుత్వ ప్రాధమిక ఆసుపత్రిలో కొత్త "ఆక్సిజన్ ప్లాంట్" ఏర్పాటు చేయించిన వైద్యశాఖ మంత్రులు మల్లాడి కృష్ణారావు. యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేస్తున్న "ఆక్సిజన్ ప్లాంట్" సంబంధించిన పనులను దగ్గరుండి పర్యవేక్షించి పనులను పూర్తి చేయించారు. కరోనా కష్టకాలంలో వారి పూర్తి సేవలను పుదుచ్చేరి ప్రజలకు అందించారు.

ప్రముఖుల పలుకులు

[మార్చు]

మంత్రి మల్లాడి కృష్ణారావు లాంటి చిత్తశుద్ధిగల నాయకుడు దొరకడం యానాం ప్రజల అదృష్టం, మల్లాడి ప్రజల అభిష్టానికి అనుగుణంగా పనిచేస్తూ ప్రజల ఆదరణ మన్ననలు పొందుతున్నారు.ప్రజా ప్రతినిధులు, నాయకులు, మంత్రి మల్లాడిని ఆదర్శంగా తీసుకోవాలి -6.1.2010 న నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి రోశయ్య .

మూలాలు

[మార్చు]
  1. The Hindu
  2. "Yanam MLA May Cross Over to AINRC Ahead of 2016 Poll". Archived from the original on 2016-08-17. Retrieved 2020-07-04.