గొల్లవానితిప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొల్లవానితిప్ప
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం భీమవరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 534239
ఎస్.టి.డి కోడ్

గొల్లవానితిప్ప, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం లోని ఒక గ్రామము.[1]. గొల్లవానితిప్ప భీమవరం పట్టణానికి 8 కి.మీ దూరములో ఉంది.

జీవనం[మార్చు]

ఈ గ్రామము.[1] సముద్రతీరమున ఉంది. ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, మరియు చేపలవేట. ప్రధానంగా పండించే పంట వరి అయినా దాదాపు చాలా వరకూ పంట చేలు చేపల, రొయ్యల చెరువులుగా మార్పు చెందినవి. గ్రామము.[1] లో పిల్లల నుండి పెద్దలు అడవారు అందరూ మత్య సంభంద పనులు చేస్తుంటారు. నత్తల, నత్త గుల్లల సేకరణ, చేపపిల్లల పెంపకం తదితర పనులు.

జనాభా[మార్చు]

ఈ గ్రామ జనాభా సుమారు 6000 వరకూ ఉంది.

గ్రామంలో సౌకర్యాలు[మార్చు]

  • గ్రామంలో చిన్న ప్రాథమిక వైద్య కేంద్రము (PHC) ఉంది.
  • విద్య కొరకు పదవ తరగతి వరకూ ఉన్నత పాఠశాల ఉంది. కళాశాల విద్యకొరకు భీమవరం వెళతారు.

దేవాలయాలు[మార్చు]

గ్రామ దేవత అయిన గరవాలమ్మ వారి దేవాలయం ఉంది. గొల్లవానితిప్పకు దగ్గరగా ఉన్న చూడదగ్గ ప్రదేశములు: గొల్లపాలెం సముద్ర తీరం (beach), పేరుపాలెం సముద్ర తీరం (beach).


  1. 1.0 1.1 1.2 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు