Jump to content

గోకర్ణమఠం

అక్షాంశ రేఖాంశాలు: 15°54′41″N 80°38′52″E / 15.911268°N 80.647845°E / 15.911268; 80.647845
వికీపీడియా నుండి
గోకర్ణమఠం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గోకర్ణమఠం is located in Andhra Pradesh
గోకర్ణమఠం
గోకర్ణమఠం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°54′41″N 80°38′52″E / 15.911268°N 80.647845°E / 15.911268; 80.647845
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నిజాంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522314
ఎస్.టి.డి కోడ్ 08648

గోకర్ణమఠం, బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం నిజాంపట్నం పంచాయతీ పరిధిలో ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ గోకర్ణేశ్వర ఆలయం

[మార్చు]
  1. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఈ శివాలయనికి ప్రత్యేక చరిత్ర ఉంది. పూర్వం చోళరాజుల కాలంలో, తిమ్మభూపాలుడు నేటి నిజాంపట్నం ప్రాంతాన్ని పరిపపాలించే రోజులలో ఇక్కడ గోసంపద ఎక్కువగా ఉండేది. ఒక రోజు గోవులకాపరి గోవులను అడవికి మేతకై అరణ్యంలోనికి తోలుకొనివెళ్ళాడు. ఆ అడవిలో లంబకర్ణ ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఆ గోవులు ముని తపస్సు చేసుకునే ప్రాంతంలో సంచరిస్తుండగా, ఆ గోవులలలోని ఒక కపిల వర్ణం గల గోవు, ముని చుట్టూ ప్రదక్షణలు చేసి పాలు కార్చేది. ఆ పాలను ముని ఆహారంగా తీసుకునేవాడు. ఇంటివద్ద గోవు పాలు సరిగ ఇచ్చేది కాదు. ఇది నిత్యం జరుగుచుండగా, చూచిన రాజు గోవు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని, గోవుల కాపరిని ఆదేశించాడు. ఆ గోవు సంచారాన్ని రహస్యంగా గమనించిన గోవులకాపరి కోపించి, గోవు కుడిచెవిపై గొడ్డలితో కొట్టగా గోవు మృతిచెందినది. ముని ఆ గోవు మృతదేహాన్ని సమాధి చేశాడు. గోవులకాపరి వెళ్ళి గోవును పులి చంపిందని రాజుకి అబద్ధం చెప్పాడు. తదనంతరం రాజు స్వయంగా అడవికి వెళ్ళి, మునిని విచారించగా నిజం తెలిసింది. అప్పుడు సమాధి త్రవ్వి చూడగా, గోవు కుడి కర్ణం (చెవి) నుండి ఒక శివలింగం బయట పడింది. రాజు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇది గోకర్ణేశ్వర ఆలయంగా, ఆ గ్రామం, గోకర్ణమఠం గా నామకరణం చేశారు. అప్పటినుండి ఈ గ్రామానికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయ ప్రస్తుత ఛైర్మన్ పులుగు సాంబశివ రావు. ఈ ఆలయంలో, ధ్వజస్తంభం శిథిలమవటంతో, నూతనంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు. దాతల సాయంతో, నవగ్రహాల మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం చుట్టూ రు. 4 లక్షల వ్యయంతో ప్రహరీగోడ ఏర్పాటుచేస్తున్నారు.
  2. ఈ ఆలయంలో, 2015, ఫిబ్రవరి-9, సోమవారం నాడు, శ్రీ గోకర్ణేశ్వరస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమాలు, పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

ఆంజనేయస్వామివారి విగ్రహం

[మార్చు]

ఈ ఆలయ ప్రాంగణంలో, 2016, మార్చి-6వ తేదీ ఆదివారంనాడు, 15 అడుగుల ఎత్తయిన శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు.

శ్రీ రామాలయం

[మార్చు]
  • శ్రీ వీర్లంకమ్మ తల్లి ఆలయం: వీర్లంకమ్మ ఇక్కడి రెడ్ల గ్రామ దేవత. ప్రతి ఏడాది ఇక్కడ వీర్లంకమ్మ కొలుపులు జరుగుతాయి. వీర్లంకమ్మ పుట్టినిల్లు కారంపూడి. ఈ కొలువులు 3 పూటల పాటు నిర్విరామంగా జరుపుతారు.
  • గాంధీ విగ్రహం.
  • అందమైన పొలాలు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు, మిర్చి

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

ఈ గ్రామవాసుల జీవనాదారం ముఖ్యంగా వరి, రొయ్యల చెరువులు. ఈ ఊరికి దగ్గరలో సముద్ర తీరం ఉంది. ఈ ఊరు మూడు భాగాలుగా విభజించబడింది.