గోగులమూడి
స్వరూపం
గోగులమూడి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°06′24″N 80°21′45″E / 16.106757°N 80.362378°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | పెదనందిపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | కట్టా సునీత |
పిన్ కోడ్ | 522015 |
ఎస్.టి.డి కోడ్ | 0863 |
గోగులమూడి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామములోని విద్యాసౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామ పంచాయతీ
[మార్చు]- గోగులమూడి సర్పంచి పదవికి, ఏకగ్రీవం ఆనవాయితీగా ఉంది. గతంలో చిగురుపాటి వీరయ్య చౌదరి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఇతను 1962 నుండి 1988 వరకూ సర్పంచిగా పనిచేసారు. ఇందులో రెండు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. మధ్యలో ఒక విడత పోటీ చేశారు. ఆయన హయాంలో గోగులమూడి-రావిపాడు రహదారి, రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. మౌలిక వసతులకల్పన, వాటర్ ట్యాంక్ నిర్మాణం, పాఠశాలల ఏర్పాటుకు కృషిచేసారు. గ్రామానికి బస్సు సౌకర్యం కలుగజేసినారు. వీరు 1956లో రష్యా సందర్శించారు. వీరు 2014, అక్టోబరు-11న కాలధర్మం చెందినారు. ఆ తరువాత శ్రీ వెలినేని కృష్ణారావు పోటీలో గెలుపొంది, గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేశారు. కృష్ణారావు తరువాత లావు సోమయ్య, లావు సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. 2006 నుండి ఇప్పటివరకూ, శ్రీ జక్కం నాగేశ్వరరావు సర్పంచిగా పనిచేసి గ్రామాభివృద్ధికి పాటుబడ్డారు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కట్టా సునీత, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది..
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవాలయం:- ఈ ఆలయంలో స్వామివారి 19వ వార్షికోత్సవం, 2014, మే-11, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తరలి వచ్చి, స్వామివారికి పూజలు చేసారు. పలువురు దంపతులు గణపతి శాంతికళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
- శ్రీ వీర్లంకమ్మ దేవాలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2015.మే-31వ తేదీ ఆదివారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మద్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
- గోగులమూడిలో రామమందిర నిర్వాహకులకు, 2014, మార్చి-31న (ఉగాదిరోజున) లావు నాగేశ్వరరావు తరఫున, పార్వతి, సీతాసమేత రామ, లక్ష్మణ హనుమంత ఉత్సవ విగ్రహాలను, అందజేశారు.
- శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో వార్షిక తిరునాళ్ళు, 2015, జూన్-2వ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహించారు. సమీప గ్రామాలనుండి భక్తులు ఆలయానికి తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నారు.
మూలాలు
[మార్చు]