గోపి తలావ్ సరస్సు
గోపి తలావ్ సరస్సు | |
---|---|
ప్రదేశం | సూరత్, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 21°11′18.9″N 72°49′45.8″E / 21.188583°N 72.829389°E |
రకం | కృత్రిమ సరస్సు |
వ్యుత్పత్తి | మాలిక్ గోపి |
పరీవాహక విస్తీర్ణం | 35,300 మీ2 (0.0136 చ. మై.) |
నిర్వహణా సంస్థ | సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ |
నిర్మాణం | 1510 |
గరిష్ట పొడవు | 212 మీటర్లు (696 అ.) |
120,000,000 L (26,000,000 imp gal; 32,000,000 US gal) | |
ప్రాంతాలు | సూరత్ |
వెబ్‌సైట్ | Surat Tourism - Gopi Talav |
గోపి తలావ్ సరస్సు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గల సూరత్ నగరంలోని గోపిపూర్ ప్రాంతంలో కలదు . మొఘల్ సామ్రాజ్య కాలంలో సూరత్ ప్రాంత వ్యాపారి, గవర్నర్ అయిన మాలిక్ గోపి దీనిని సా.శ. 1510 లో నిర్మించారు. 2012 లో, ఈ సరస్సును సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ పునరుద్ధరించి, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని వినోద ప్రదేశంగా అభివృద్ధి చేశారు.
చరిత్ర
[మార్చు]ఈ సరస్సును నిర్మించిన మాలిక్ గోపి సూరత్‌లోని ఒక బ్రాహ్మణ వ్యాపారి. ఇతను నగరం అభివృద్ధికి చాలా కృషి చేశాడు. అతను అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని గోపిపుర అని పిలుస్తారు. అతని గౌరవార్థం గుజరాత్ రాజు అతనికి "మాలిక్" అనే బిరుదు ఇచ్చారు. అతను అభివృద్ధి చేసిన మరో పట్టణానికి జ్యోతిష్కులు "సూరజ్" లేదా "సూర్యపూర్" అని పేరు పెట్టాలని సూచించారు కానీ ఆ పేరు హిందూ సమాజానికి చెందినదిగా భావించి, దీనిని ఇష్టపడని అప్పటి మొఘల్ సామ్రాజ్య రాజు దానిని "సూరత్" (ఖురాన్ లోని అధ్యాయాల శీర్షికలు) గా మార్చారు[1]
అభివృద్ధి
[మార్చు]2012 లో, సరస్సు పరిసర ప్రాంతాలను సుమారు 22 కోట్ల (US $ 3.1 మిలియన్) బడ్జెట్‌తో పునరుద్ధరించారు. సుమారు 90,000 చదరపు మీటర్లు (970,000 చదరపు అడుగులు) భూమి పునరుద్ధరించబడింది. 212 మీటర్ల (696 అడుగులు) వెడల్పు కలిగిన సరస్సు దాదాపు 35,000 చదరపు మీటర్ల (380,000 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఉంది. ఈ సరస్సు 120,000,000 లీటర్ల నీటిని కలిగి ఉంటుంది. ఈ సరస్సు దగ్గర డైమండ్ జోన్, ఫుడ్ జోన్, ఎన్విరాన్మెంట్ జోన్, హిస్టరీ జోన్, కమ్యునల్ హార్మొనీ జోన్, టెక్స్‌టైల్ జోన్, సూరత్ ను జమాన్ అనే ఏడు జోన్లు కలిగి ఉంది. ఈ జోన్లను అభివృద్ధి చేయుటకు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది..[2]
ఈ సరస్సు చుట్టూ ఉన్న ఉద్యానవనం పునరాభివృద్ధి అహ్మదాబాద్ లోని కంకరియా సరస్సు పునరుద్ధరణపై ఆధారపడి ఉంటుంది.[3][4]
చిత్రాలు
[మార్చు]-
ప్రవేశ ద్వారం
-
ఫౌంటెన్, బోటింగ్
-
ఫౌంటెన్
మూలాలు
[మార్చు]- ↑ Khurana, Ashleshaa (1 March 2014). "504-year-old Surat's lost lake Gopi Talav set to regain glory". Times of India. Surat. Retrieved 6 December 2015.
- ↑ Bhatt, Himansshu (25 December 2012). "Gopi Talav to get a new avatar next year". Times of India. Retrieved 9 December 2015.
- ↑ "CM wants to make Surat best city in the world". Daily News & Analysis. 5 December 2015. Retrieved 11 January 2016.
- ↑ Khurana, Ashleshaa (29 July 2015). "Gopi Talav to open for public in Sept". Times of India. Retrieved 10 December 2015.