Jump to content

గోబీ మంచురియా

వికీపీడియా నుండి
గోబీ మంచురియా

గోబీ మంచురియాతయారు చేయు విధానము

కాలి ప్లవర్

కావలసిన పదార్థాలు

[మార్చు]
  • కాలీఫ్లవర్ - 1,
  • మైదా - 3/4 కప్పు,
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూన్స్,
  • కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్,
  • ఆలుగడ్డ - 1,
  • ఉల్లిగడ్డ -1,
  • అజినామొటో - పావు టీ స్పూన్,
  • పచ్చిమిరపకాయలు - 2,
  • టమాటా సాస్ - 2 స్పూన్స్,
  • సోయాసాస్ - 2 స్పూన్స్,
  • కొత్తిమీర - అర కట్ట,
  • నూనె, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం

[మార్చు]
గోబీ మంచురియా
  • గోబీని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  • ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, నీళ్లు పోసి కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
  • కడాయిలో నూనె పోసి స్టవ్ మీద పెట్టి కలిపి పెట్టుకున్న మిశ్రమంలో గోబీ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి స్టవ్ మీద పెట్టి అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో అజినామొటో, సోయాసాస్, టమాటా సాస్ వేసి కలపాలి.
  • ఐదు నిమిషాల తర్వాత వేయించుకున్న గోబీని ఇందులో వేసి మరికాసేపు కలియబెట్టాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
  • గార్నిష్ చేసిన గోబీ మంచురియా చాల రుచి కరంగా తయారవుతుంది.

వనరులు

[మార్చు]

http://telugutaruni.weebly.com/15/category/0399cf60b9/1.html[permanent dead link]