గోల్డ్ పెంటాఫ్లోరైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోల్డ్ పెంటాఫ్లోరైడ్
గోల్డ్(V)ఫ్లోరైడ్
పేర్లు
IUPAC నామము
గోల్డ్(V)ఫ్లోరైడ్
ఇతర పేర్లు
గోల్డ్ పెంటాఫ్లోరైడ్
Perauric fluoride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [57542-85-5]
ధర్మములు
AuF5
మోలార్ ద్రవ్యరాశి 291.959 g/mol
స్వరూపం red unstable solid
ద్రవీభవన స్థానం 60 °C (140 °F; 333 K) (decomposes)
Decomposes
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
orthorhombic (Pnma)
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Corrosive, toxic
సంబంధిత సమ్మేళనాలు
ఇతర కాటయాన్లు
SbF5, BrF5, IF5
సంబంధిత సమ్మేళనాలు
AuF3, AuF7
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
YesY verify (what is YesYN ?)
Infobox references

గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ ఒక రసాయన సంయోగపదార్ధం. ఇది ఒక అకర్బన రసాయనపదార్ధం. బంగారం, మరియు ఫ్లోరిన్ మూలకాల పరమాణు సంయోగం వలన గోల్డ్(V) ఫ్లోరైడ్ ఏర్పడినది. ఈ ఫ్లోరైడ్ సమ్మేళనపదార్థంలో బంగారం అత్యంత ఎక్కువ స్థాయిలో, +5ఆక్సీకరణ స్థితిని పొంది ఉంది. ఎర్రని గోల్డ్(V) ఫ్లోరైడ్ ఘనపదార్థం హైడ్రోజన్ ఫ్లోరైడ్ లో కరుగుతుంది, కాని కరిగిన తరువాత ఈ ద్రవణాలు వియోగం చెంది, ఫ్లోరిన్ విడుదల అగును. గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ రసాయన సంకేత పదం Au2F10/ AuF5

భౌతిక లక్షణాలు[మార్చు]

గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ ఒక అస్థిరమైన ఎర్రని ఘనపదార్థం. గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ అణుభారం 291.959 గ్రాములు /మోల్. గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం 60 °C (140 °F; 333K, ఈ ఉష్ణోగ్రతవద్ద వియోగం చెందును. నీటిలో వియోగం చెందును.గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటా ఫ్లోరైడ్ ఒక శక్తివంతమైన/దృఢమైనటువంటి ఫ్లోరిన్ అయాన్ గ్రహీత(ion acceptor). అంటిమొని పెంటాక్సైడ్ కన్న ఎక్కువస్థాయిలో గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటాఫ్లోరైడ్, ఫ్లోరిన్ అయాన్‌ను స్వీకరిస్తుంది/గ్రహిస్తుంది.

సంశ్లేషణ[మార్చు]

ఆక్సిజన్ మరియు ఫ్లోరిన్ వాయుపూరిత వాతావరణప్రదేశంలో,370°Cవద్ద,8 అట్మాస్‌ఫియర్ వత్తిడి వద్ద బంగారాన్ని వేడి చెయ్యడం వలన డైఆక్సిజేనిల్ హెక్సాఫ్లోరో ఆరేట్(O2AuF6(s) ఏర్పడును.

Au(s) + O2(g) + 3 F2(g) → O2AuF6(s)

ఇలా ఏర్పడిన డైఆక్సిజేనిల్ హెక్సాఫ్లోరోఆరేట్ లవణపదార్ధం 180 °Cవద్ద గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటాఫ్లోరైడ్‌ను ఏర్పరచును.

2O2AuF6(s) → Au2F10 (s) + 2 O2(g) + F2(g)

క్రిప్టాన్ డైఫ్లోరైడ్ అత్యంత శక్తివంతమైన ఆక్సీకరణకారకం మరియు ఫ్లోరినేటింగు కారకం.ఇది బంగారాన్ని, బంగారం యొక్క అతిఎక్కువ ఆక్సీకరణస్థితి అయిన +5 స్థితికి ఆక్సీకరిస్తుంది.

7 KrF2 (g) + 2Au (s) → 2 KrF+AuF−6 (s) + 5 Kr (g)

KrF+AuF−6 అనునది 60°Cవద్ద గోల్డ్(V) ఫ్లోరైడ్/గోల్డ్ పెంటా ఫ్లోరైడ్, క్రిప్టాన్ మరియు ఫ్లోరిన్ వాయువులుగా వియోగం చెందును.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/అధారాలు[మార్చు]