గౌడీయ నృత్య
మహువా ముఖర్జీ గౌడియ నృత్య ప్రదర్శన | |
| శైలి | భారతీయ శాస్త్రీయ నృత్యం |
|---|---|
| వాయిద్యం | అనద్ధ, ఘనా, సుసిర్, టట |
| మూలం | బెంగాల్ |
గౌడీయ నృత్య అనేది బెంగాల్ రాష్ట్రానికి చెందిన భారతీయ శాస్త్రీయ నృత్య రూపం.[1][2][3][4] ప్రాచీన కవులు, ముఖ్యంగా వైష్ణవ కవులు, గౌడీయ సంగీతంలోని రాగాలు, తాళాలకు అనుగుణంగా రాసిన పాటల ద్వారా ఈ నృత్యం, మతపరమైన కథలను వ్యక్తీకరిస్తుంది. గౌడీయ నృత్య ప్రదర్శనలు హిందూ దేవతలైన శివుడు, గణేశుడికి సంబంధించిన సంప్రదాయాలను, భావనలనూ వ్యక్తపరుస్తాయి.
ఈ నృత్యాన్ని 1980లలో మహువా ముఖర్జీ పునర్నిర్మించింది.[5] ఆమె రవీంద్రభారతి విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలు.[6][7] లలిత కళల ఫ్యాకల్టీకి డీన్. తన భర్త అమితావ ముఖర్జీతో కలిసి, ఆమె 1980[8] ల నుండి గౌడీయ నృత్య శైలిని పునరుద్ధరిస్తోంది. అమెరికాలోని ఓక్లహోమా విశ్వవిద్యాలయంలో ఆమె విజిటింగ్ ప్రొఫెసర్ గా ప్రదర్శనలు, ఉపన్యాసాలు ఇస్తోంది.[9][10] ఆమె బెంగాల్ క్లాసికల్ డ్యాన్స్, గౌడీయ నృత్య అనే పుస్తకాన్ని రాసింది. దీన్ని కోల్‌కతా లోని ది ఏషియాటిక్ సొసైటీ ప్రచురించింది.[11] భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గౌడీయ నృత్యంపై పరిశోధనలకు స్కాలర్‌షిప్‌ను ప్రదానం చేసింది.
నేపథ్యం
[మార్చు]1994 సెప్టెంబరు 21 న గౌడీయ నృత్య అనే పేరును ఇండాలాజిస్ట్ బ్రతీంద్రనాథ్ ముఖోపాధ్యాయ సలహా మేరకు స్వీకరించారు. దీనికి కారణం - భారతీయ సంగీతం, సాహిత్యంలో గౌడీయ శైలి ఉనికి ఉంది. పురాతన కాలంలో శశాంకుడి పాలన లోను, పాల, సేన యుగాల సమయంలోనూ మొత్తం బెంగాల్‌ను 'గౌడ' అని పిలిచేవారు. పదిహేనవ శతాబ్దంలో ఒడిశాకు చెందిన సంగీత శాస్త్రవేత్త అయిన మహేశ్వర మొహాపాత్ర, తన అభినయ చంద్రికలో ఏడు రకాల నృత్య శైలులను ప్రస్తావించాడు. వాటిలో గౌడీయ నృత్యం కూడా ఒకటి.
చరిత్ర
[మార్చు]గౌరీక నృత్యం సైద్ధాంతిక పునాదులను పురాతన సంస్కృత గ్రంథం నాట్యశాస్త్రంలో చూడవచ్చు; పురాతన కాలంలో దీని ఉనికిని గౌడీయ శైలి ఆలయం, హిందూ మతం, బౌద్ధమతం, జైన మతాలతో సంబంధం ఉన్న పురావస్తు ప్రదేశాల శిల్పాలలో నృత్య భంగిమలు ధృవీకరించాయి. దీనిని ప్రాచీన బెంగాల్ కవులు ప్రస్తావించారు. భారతదేశం వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత, 1980లలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణం, వ్యాప్తి పొందింది. దీనిని బెంగాలీ పరిశోధకురాలు, నృత్యకారిణి మహువా ముఖర్జీ పునర్నిర్మించింది.[12][13] ఈ నృత్యంపై పరిశోధన కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిశోధన స్కాలర్‌షిప్‌ను ప్రదానం చేసింది,[14][15] ఇది ప్రధానంగా భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రోత్సహించడానికి అందిస్తున్నారు. కోల్‌కతాలోని రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం, అమెరికాలోని ఒక్లహోమా విశ్వవిద్యాలయం దీనిని శాస్త్రీయ నృత్య రూపంగా గుర్తించాయి.[16][17][18][19]
మూలాలు
[మార్చు]- ↑ "Gaudiya Nritya". Indian Culture. Retrieved 14 April 2025.
- ↑ Roma Chatterji (2005). Folklore and the Construction of National Tradition Archived ఫిబ్రవరి 12, 2018 at the Wayback Machine. Indian Folklife 19 (Folklore Abroad: On the Diffusion and Revision of Sociocultural Categories): 9. Accessed January 2014. "a classical dance tradition that has vanished from the urban areas".
- ↑ "West Bengal Tourism: Dance". Department of Tourism, Government of West Bengal. 2011. Archived from the original on అక్టోబరు 21, 2013. Retrieved జనవరి 11, 2014.
- ↑ Bharatram, Kumudha (April 9, 2011). "Dance of the ancients". The Hindu. Retrieved November 15, 2013.
- ↑ Foster, S. (2009-06-10). Worlding Dance (in ఇంగ్లీష్). Springer. ISBN 9780230236844.
- ↑ Foster, S. (2009-06-10). Worlding Dance (in ఇంగ్లీష్). Springer. ISBN 9780230236844.
- ↑ "Members of The Faculties". Rabindra Bharati University. Archived from the original on 12 December 2013. Retrieved 14 January 2014.
- ↑ Alom, Zahangir (11 November 2013). "Of euphoria and grace in dancing devotion". The Daily Star (Bangladesh). Archived from the original on 7 January 2014. Retrieved 7 January 2014.
- ↑ Alom, Zahangir (25 March 2012). "Presentation of Navarasa through dance". The Daily Star (Bangladesh). Archived from the original on 7 January 2014. Retrieved 7 January 2014.
- ↑ Alom, Zahangir (25 March 2012). "Presentation of Navarasa through dance". The Daily Star (Bangladesh). Archived from the original on 7 January 2014. Retrieved 7 January 2014.
- ↑ Mukherjee, Mahua (2000). Gaudiya Nritya (in Bengali). Kolkata: The Asiatic Society.
- ↑ Bharatram, Kumudha (April 9, 2011). "Dance of the ancients". The Hindu. Retrieved November 15, 2013.
- ↑ Rajan, Anjana (December 26, 2006). "The wheel has come full circle". The Hindu. Archived from the original on November 8, 2012.
- ↑ "Gaudiya Nritya". INDIAN CULTURE (in ఇంగ్లీష్). Retrieved 2022-01-25.
- ↑ "Scholarship to Young Artistes, 2005". Ministry of Culture. Government of India. Archived from the original on అక్టోబరు 21, 2013.
- ↑ "Feet forgotten and found". www.telegraphindia.com. Retrieved 2022-01-25.
- ↑ Utpal Kumar Banerjee (2006). Indian performing arts: a mosaic. New Delhi: Harman Publishing House. ISBN 9788186622759. p. 79: "re-creating Gaudiya Nritya as one of the acceptable classical styles will need a formal framework".
- ↑ Leela Venkataraman (2006). Negotiating the Extremes: dance. India International Centre Quarterly, 33 (1): 93-102. (subscription required) "one may have reservations about the classical dance repertoire visualised by [Mukherjee]".
- ↑ Roma Chatterji (2005). p. 9: "Mukherjee tries to reconstitute a Bengali aesthetic within the perspective of pan-Indian civilisation".