గ్నూ/లినక్స్ పేరు వివాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్నూ/లినక్స్ పేరు వివాదం అనేది వ్యవహారికంగా లినక్స్ అని పిలవబడే నిర్వాహక వ్యవస్థను లినక్స్ పేరుతో సూచించడంపై ఫ్రీ అండ్ ఓపెన్​సోర్స్ సాఫ్ట్​వేర్ కమ్యూనిటీ (స్వేచ్ఛ, స్వతంత్ర సాఫ్ట్​వేర్ సంఘాల) సభ్యుల మధ్య ఒక వివాదం ఉంది. గ్నూ సాఫ్ట్​వేరుతో పాటు, లినక్స్ కెర్నలుతో కూడిన నిర్వాహక వ్యవస్థల కోసం గ్నూ/లినక్స్ అనే పదం వాడాల్సిందిగా ఫ్రీ సాఫ్ట్​వేర్ ఫౌండేషన్, వ్యవస్థాపకుడు రిచర్డ్ స్టాల్‌మన్, దాని మద్ధతుదారులు ప్రచారం చేస్తారు. ఎఫ్ఎస్ఎఫ్ గ్నూ/లినక్స్ పదం కోసం ఎందుకు వాదిస్తుందంటే, గ్నూ అనేది ఒక స్వేచ్ఛా నిర్వాహక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సుదీర్ఘకాలంగా పాటుపడుతున్న ఒక పరియోజన, ఇందులో మిస్సయిన (తప్పిపోయిన) ఆఖరు భాగంగా కెర్నలును వారు పేర్కొంటారు.