గ్రంథి శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రంథి శ్రీనివాస్‌
గ్రంథి శ్రీనివాస్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2009
నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 14 అక్టోబర్ 1964
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు గ్రంధి వెంకటేశ్వర రావు[1]
నివాసం కైకలూరు

గ్రంథి శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

గ్రంథి శ్రీనివాస్‌ 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించాడు. ఆయన 1981లో భీమవరంలోని కె.జి.ఆర్.ఎల్.జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

గ్రంథి శ్రీనివాస్‌ విద్యార్థిదశలోనే రాజకీయాల్లో వచ్చి ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతాపార్టీలో పని చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి భీమవరం పట్టణ కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారిగా, పశ్చిమ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షడిగా, 1995లో భీమవరం అర్బన్‌బ్యాంక్‌ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పెన్మెత్స వెంకటనరసింహరాజు పై 7905 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

గ్రంథి శ్రీనివాస్‌ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరాడు, కానీ ఆయనకు పార్టీ టికెట్ దక్కలేదు. ఆయన 2011లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ ఉంటూ 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేశాడు. గ్రంథి శ్రీనివాస్‌ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై 8357 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. The News Minute (3 October 2020). "Andhra's Kasturba govt college renamed after YSRCP MLA's father, row erupts" (in ఇంగ్లీష్). Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  2. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  3. Sakshi (26 March 2019). "నేను లోకల్‌." Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  4. Sakshi (24 March 2019). "అందరివాడు..అందనివాడు". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  5. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.