గ్రహాంతర వాసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రహాంతర వాసి ఊహా చిత్రం

ఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలొ కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైనవారని, వారే గ్రహాంతర వాసులు (ఆంగ్లం: Aliens) అంటూ ఉంటారు.వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాలు (ఆంగ్లం: Flying Saucers) లేదా గుర్తించబడని ఎగిరే వస్తువుల ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం.

గ్రహాంతరవాసులు ఉన్నారా?

[మార్చు]

గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు, పరిణామం (evolution) మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు. ఆ జీవులు క్రమేణా పరిణామం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న మార్స్ (కుజ లేదా అంగారక) గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజ గ్రహం మీదకు వెళ్లడానికే ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌరమండలాలలోని గ్రహాల మీది పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది. ఆయా గ్రహాల మీద గ్రహాంతర వాసులెవరైనా ఉన్నా వాళ్లు భూమి దగ్గరకి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్నా వారిని మనం చూడడం దాదాపు అసంభవం.

మనకన్నా తెలివైన వారా?

[మార్చు]

వారు అప్పుడప్పుడు ఎగిరే పళ్ళాలు సహాయంతొ ఈ భూమి మీదకు వస్తూఉంటారని,ఆ వాహనాలను చూశామని చెబితూఉంటారు.వాటిని ఫొటోలు కూడా తీశారు.దీన్ని బట్టి చూస్తే వారు మనకన్నా ఎన్నో రెట్లు తెలివైనవారని అనుకోవచ్చు.

ఒక వాదన: ఉదాహరణకు చీమ కేవలం రెండు డైమన్షన్స్ మాత్రమే గుర్తించగలదు. అలాగే మనుషులు కూడా వారి భౌతికమైన దృష్టితో చూడలేని డైమన్షన్స్ ఉండి ఉండవచ్చుకదా?

"గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారు. అయితే, మనం వారితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకునే యత్నం చేయనే కూడదు .విశ్వాంతరాళాల్లో ఎక్కడో కచ్చితంగా ఈ జీవులు మనుగడ సాగిస్తున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు కేవలం ఇతర గ్రహాలపై మాత్రమే కాదు. నక్షత్రాల సరసన....లేదంటే గ్రహాల మధ్యన ఉండే ప్రదేశంలో తేలుతూ కూడా ఉండే అవకాశం లేకపోలేదు .గగనాంతర రోదసిలో కనీసం వంద బిలియన్ల పాలపుంతలున్నాయి. వాటిల్లో కోట్లాది నక్షత్ర సమూహాలున్నాయి. ఇంత సువిశాల విశ్వంలో కేవలం ఒక్క భూమిమీద మాత్రమే ప్రాణికోటి మనుగడ సాగిస్తున్నదనే తుది నిర్ణయానికి రాలేం కదా!'ఇన్ని పాలపుంతలు, గ్రహాలు, నక్షత్ర సమూహాలున్నప్పుడు... వాటిల్లో గ్రహాంతర వాసులు మనుగడ సాగిస్తున్నాయనుకోవడం కచ్చితం సహేతుకమే అవుతుంది". --విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్

గ్రహాంతరవాసుల లైంగిక దాడి

[మార్చు]

ఏలియన్స్ మానవులతో శారీరక సంబంధాలను కలిగి ఉన్నాయని, వారి కారణంగా ఒక మహిళ గర్భవతి అయిందనే వార్త 'ది సన్' వెల్లడించింది. ఓ వ్యక్తి వేసిన సమాచార హక్కు పిటిషన్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఇచ్చిన 1,500లకు పైగా పేజీల రిపోర్టులో కనీసం ఐదు సార్లు ఏలియన్, హ్యూమన్ సెక్సువల్ ఎన్ కౌంటర్లు జరిగినట్టు పేర్కొంది.[1][2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. sumabala. "మానవులతో ఏలియన్ల శృంగారం.. గర్భం దాల్చిన మహిళ? నిజమే అంటున్న డీఐఏ..." Asianet News Network Pvt Ltd. Retrieved 2022-04-08.
  2. "మానవులతో ఏలియన్ల శృంగారం!". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-08. Retrieved 2022-04-08.