గ్రీష్మ భూమి కథలు
గ్రీష్మ భూమి వేంపల్లి గంగాధర్ రాసిన కథా సంకలనం.
రచయిత పరిచయం
[మార్చు]డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త . రాష్టపతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిధిగా వీరు విడిది చేశారు. వీరి కథా సంకలనం ' గ్రీష్మ భూమి'. ఇందులో 13 కథలు ఉన్నాయి.
కథలు
[మార్చు]- ఎడారి ఓడ
- వాడొక్కడు
- హంసనత్తు
- ఉరుసు
- నల్ల ఛత్రి
- ఊర్ధ్వ పీడనం
- ఆగ్రా టాంగా
- తూర్పు మండపం
- కొయ్య కాళ్ళ మనిషి
- ఒక జింకల కొండ ఒక దేవళం చెరువు
- జముడు పువ్వు
- శరణా గతుడు
- ఏడుతలల నాగు
విశేషాలు
[మార్చు]ఈ పుస్తకంలోని కథలు వాస్తవికతను ప్రతిబింబిస్తూ కడప జిల్లా మాండలికంలో రాయబడినవి. ఈ కథలను సాఫీగా చదువుకోవడానికి ప్రాంతీయ భాషా పడికట్టులు అడ్డు తగలవు. ఈ పుస్తకంలోని 13 కథల లోనూ కడప జిల్లా లోని పలు ప్రాంతాల మనుషులూ, వాతావరణం, రాజకీయాలకు ఇంకా అతకని మనస్తత్వాలు కనిపిస్తాయి. కథలన్నీ వాస్తవికతనూ, మానసిక దౌర్భల్యాల నుండి బయట పడీ పడకుండా ఉండే మనుషులను, దేశాభ్యుదయానికి జరగవలసిన మార్పు చేర్పులను సూచిస్తాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ గ్రీష్మ భూమి కథలు - వెనుక కవర్ పుటలో విరించి రాసిన పుస్తక పరిచయం నుండి.