Coordinates: 16°54′16″N 81°20′43″E / 16.904428°N 81.345241°E / 16.904428; 81.345241

ఘంటావారిగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘంటావారిగూడెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఘంటావారిగూడెం is located in Andhra Pradesh
ఘంటావారిగూడెం
ఘంటావారిగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°54′16″N 81°20′43″E / 16.904428°N 81.345241°E / 16.904428; 81.345241
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం నల్లజర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534112
ఎస్.టి.డి కోడ్

ఘంటావారిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల మండలంలోని రెవెన్యూయేతర గ్రామం

బస్సు దిగగానే ఎంబ్రదర్ ఎలాఉన్నారు అని పలకరిస్తున్నట్లు ఎదురుగా ఎన్.టి.ఆర్. విగ్రహంతో మొదలయ్యే ఈ ఊరు మొదటగా వచ్చిన ఘంటావారు (ప్రస్తుతం ఉన్న వారుకాదు) ఇంటిపేరు మీద ఏర్పడిందని పెద్దలు చెపుతారు. ఈ గ్రామం దాదాపు 2000 సంవత్సరం నాటిక్ 400 నుంచి 500 సంవత్సరాలకు పూర్వం నిర్మితమై ఉంటుందని చెపుతారు. ఇది 1960 వ సంవత్సరం వరకు దూబచర్ల పంచాయితీలో కలసి ఉండేది. ఆతరువాత స్వతంత్ర పంచాయితీగా ఏర్పడింది. ఈ ఊరు ప్రక్కనే ఉన్న మారంపల్లి, లక్ష్మినగరం గ్రామాలు ఈ గ్రామం రైతులు నిర్మించినవే. వ్యసాయ భూములు దూరం కావడంతో యాభై అరవై సంవత్సరాలక్రితం ఆరెండు ఊర్లు నిర్మించారు. ఐతే అవి ద్వారకాతిరుమల మండలం కావడంతో ప్రత్యేకపంచాయతీగా ఏర్పడినవి. ప్రధానకులాలు: కమ్మ, వైశ్య, గౌడ, సెట్టిబలిజ, చాకలి, కమ్మరి, మంగలి, మాల, మాదిగ ఇంకా తక్కువ సంఖ్యాపరంగా కాపు, ఉప్పరి, గొల్ల, తెలిక, కుమ్మరి కలాలు వారు ఉన్నారు

ప్రధానవృత్తి: వ్యసాయం, ప్రధానపంటలు: గతంలో జీడి, మామిడి, నాటు పొగాకు, చెరకు, వేరుశనగ, ప్రస్తుత్సం కొబ్బరి, పామాయిల్, అరటి, మొక్కజొన్న, వేరుశనగ, వరి, నిమ్మ చెరువులు: పంచాయితీ ఊరచెరువు, కోనేరు, జగ్గయ్యచెరువు, గన్నేరుగుంట, మంచిలపాడు గుంట, మునియ్య చెరువు, దేవుడచ్చియ్యచెరువు ప్రాథమిక పాఠశాలలు; మూడు ఉన్నాయి, ఉన్నతపాఠశాల: దూబచర్ల

గుళ్ళు; పాతూరి గంగారాజుగారి పొలంలో వెలసిన స్వయంభూ సుబ్ర మణ్యీశ్వర స్వామి గుడి ఇంకా శివాలయం, రామాలయాలు, విఘ్నేశ్వరస్వామి గుళ్ళు చర్చులు మొదలైనవి.గ్రామదేవత: గంగానమ్మ మొట్టమొదటి పట్టబద్రుడు: దేవిన వెంకటరావుగారు మొట్టమొదటి సర్పంచ్: వేగి బాలయ్య. ప్రస్తుత సర్పంచ్: తాతిన పుష్పాంజలి. ప్రత్యేకత: వేరుశనగ మిల్లులు జిల్లలో చింతలపూడి తర్వాత అగ్రస్తానంలో ఉంది. జీడిపప్పు మిల్లులు, బోర్వేల్ల్స్ రిగ్గులు జిల్లలో మాదే ప్రత్యేకత, అన్నిరకాల పంటలు పండే నల్లమెట్ట, ఎర్రమెట్ట, నల్లరేగడి, గరప, ఇసుక నేలలు ఉన్నాయి.బిరుదు: ఒకప్పుడు వేరుశనగ బాగా ఎక్కువగా సాగవుతుండటం ఘంటావారిగూడెం చినరంగం అనేవారట. 1991 సంవత్సరం రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన గొడవలు ఊరి చరిత్రలో మరపురాని దుస్సంఘటన. ఈ ఉరితోపాటు చుట్టుప్రక్కల మేట్టప్రాంతమంతా 1970 ల వరకూ వర్షాదారంతోనే పంటలు పండేవి. అప్పటి జలగం వెంగళరావు ప్రభుత్వం ఐఢిసి బోరు బావులు వేయించడంతో పరిస్థితులు మెరుగుపడినాయనిచెబుతారు. తర్వాత ఎన్.టి.ఆర్. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎవరికీ వారు స్వంత బోరు బావులు వేయించుకుని వ్యసాయంలో మంచిలాభాలు అందుకున్నారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]