చండాలుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చండాలుడు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

[మార్చు]

అంటరానివాడు, అంతవాసి, అంతావ (శా) (సా) యి, అంత్యజాతివాడు, అంత్యజుడు, చండాల స్త్రీ, మాలది, అంత్యయోని, మాల, మాలడు, మాలవాడు, వెలివాడవాడు, వెలివాడు, శ్వపచుడు, శ్వపాకుడు, అంత్యవసాయి, అంత్యుడు, అవాచ్యుడు, అస్పృశ్యుడు, కటోలుడు, కడవాడు, కీకశుడు, జనంగముడు, తోచ, తోటి, దివాకీర్తి, దివాచరుడు, దోహరి, నిషాదుడు, పంచముడు, పుల్కసుడు, ప్లవకుడు, ప్లవుడు, బుక్కసుడు, సురియాళు, సురియాళువు, హరిజనుడు.


చండాల కులము ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా లోని 16వ కులం. (http://andhrabharati.com/dictionary) ఆంధ్రభారతి ఆన్‍లైన్ నిఘంటువులో చండాలుడిని మాలవాడిగా (పంచముడు) వర్ణించబడింది.

కొన్ని కథలు

[మార్చు]
ఆదిశంకరాచార్యుల ఎదుట చండాలుని రూపంలో శివుడు
  • ఆది శంకరులు కాశీలో ఒక నాడు స్నానము చేసి విశ్వనాథుని ఆలయమునకు తడి బట్టలతో వెళ్ళుచుండె నట. ఆ సమయములో ఎదురుగా ఒక చండాలుడు వచ్చుచుండెనట. ఆ కాలపు వాడుక ప్రకారము శంకరులో లేక వారి శిష్యులో వానిని తొలగి పొమ్మనెనట. నన్ను పోపొమ్మనిన మాత్రాన నేను దూరముందునా? అన్నమయమైన ఒక దేహము మరొక అన్నమయమైన దేహమునకు చెప్పు మాటలా ఇవి లేక ఒక ఆత్మ మరొక ఆత్మకు చెప్పు మాటలా ఇవి అని వాడు శంకరునకు ప్రత్యుత్తరము నిచ్చెనట. సూర్య కిరణములను అన్ని పాత్రలలోని నీరు ఒకే విధముగా ప్రతిఫలించ జేస్తుంది కదా. ఒక సూర్యుండు సమస్తలోకములకు తా నొక్కొక్కడై తోచునే యన్నట్లు ఒకే సూర్యుని ప్రతిబింబము మనకు గంగా నది నీటిలో, చండాలుని ఇంటి ప్రక్కన ఉండే నీటిలో కనబడుతుంది గదా? అదే విధముగా హేమ పాత్రలో నున్న నీటికి, మృణ్మయపాత్రలోని నీటికి ఏమి తేడా ఉంది? తక్షణమే శంకరులు తన కెదురుగా నున్నది శివశంకరుడే అని నిశ్చయించుకొని మనీష పంచకము అని ఐదు పద్యములను చెప్పెను.http://www.eemaata.com/em/issues/200707/1127.html
  • ఒక చెరువులో చాకలి బట్టలు ఉతుకుతున్నాడు. గ్రామపూజారి స్నానం చేస్తుంటే బట్టలు ఉతుకుతున్న నీటి బిందువులు ఆ పూజారిపై పడ్డాయి.బట్టలుతికిన నీళ్లు తన మీద పడినందుకు నానా దుర్భాషలాడి అతడిపై చేయిచేసుకున్నాడు. బట్టలుతికే వ్యక్తిని కొట్టి అతణ్ని ముట్టుకున్నాననే బాధ అతనిలో చోటు చేసుకుంది. వెంటనే చెరువులో మునిగి మళ్లీ స్నానం చేశాడు. కొంతదూరంలో బట్టలుతికిన వ్యక్తి కూడా స్నానం చేయడం మొదలుపెట్టాడు. అతడెందుకు స్నానం చేస్తున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు. అతని దగ్గరకు వెళ్ళి- నిన్ను తాకినందుకు నేను స్నానం చేస్తున్నాను. మరి నీవెందుకు స్నానం చేస్తున్నావని ప్రశ్నించాడు. 'మీరు నన్ను ముట్టుకున్నందుకు నేను స్నానం చేస్తున్నాను. మీ శరీరంలో కోపమనే చండాలుడు ప్రవేశించాడు. అతణ్ని ముట్టుకుని నేను అపవిత్రుణ్నయిపోయాను. అందుకే ఈ స్నాన'మని అతను బదులిచ్చాడు. పూజారికి జ్ఞానోదయమైంది. కోపం నశించనిదే ఎన్ని శాస్త్రాలు చదివినా ఏమి లాభం? దుర్గుణాలకు దూరంగా ఉండకపోతే నేను ఉత్తముణ్ని కాను అనుకున్నాడు.http://www.eenadu.net/antaryami/antarmain.asp?qry=311008anta
  • పూర్వం ఆంధ్రదేశానికి తూర్పున ఉన్న ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కరణం ఉండేవాడట. ఆయనకు ప్రమాదవశాత్తు కళ్లు పోయాయి. ఆయనకో కూతురు. చక్కని చుక్క. ఆమె మీద ఓ చండాలుడు కన్ను వేశాడు. ఎవరినో ఆశ్రయించి వేదాలు నేర్చుకుని సద్బ్రాహ్మణుడి వేషంలో గ్రామాన అడుగుపెట్టాడు. అతడి వేషభాషలకు మోసపోయిన ఊరిజనం పిల్లనిచ్చి, కరణీకాన్ని కూడా అప్పగించమని గ్రామాధికారికి సలహా ఇచ్చారు. ఆయనా సరేనని వేదోక్తంగా యధావిధిగా వివాహం జరిపించాడు. కాలక్రమంలో దంపతులకు కొడుకులు, కూతుళ్ళు కూడా పుట్టాక ఓనాడు కపటబ్రాహ్మడి స్వస్థలం నుంచి ఎవరో అటుకేసి వచ్చి, అతగాడిని పోల్చుకుని, వెనక్కి వెళ్ళాక అతని తల్లి చెవిన వేశారు. కొడుకు ఆచూకీ తెలియక అల్లాడుతున్న తల్లి వెంటనే పరుగున వెళ్ళింది. ఊరి బావి వద్ద తారసపడ్డ సుపుత్రుడు తల్లిని గుర్తుపట్టి చప్పున ఆమె తల గొరిగించి, జుమారు కట్టించి బ్రాహ్మణ వితంతువు వేషం వేయించాడు. ఆమె మాట్లాడితే గుట్టు బయటపడుతుంది. కనుక మూగదానిలా నటించాలని కట్టడిచేసి ఇంటికి తీసుకుపోయాడు. అత్తగారన్న భక్తితో కోడలు ఆమెకు సేవలు చేయసాగింది.http://thatstelugu.oneindia.in/feature/2005/sadassu.html
  • కరువు కాలంలో ఒక చండాలుడు దాచిన కుక్క మాంసాన్ని విశ్వామిత్రుడు బెదిరించి తీసుకున్నాడు.http://www.vaartha.com/content/7139/sampadakiyam.html
  • సకల ప్రాణులందు భగవంతునిదర్శించు రంతిదేవుడు నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్ళు లేకుండా పస్తులుండికూడా చండాలుని రూపంలో వచ్చిన బ్రహ్మాదిదేవతలకు జలదానం చేస్తాడు.http://neetikathalu.wordpress.com/2006/11/04/%E0%B0%B0%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/

కొన్ని పద్యాలు

[మార్చు]

నిజములాడువాడు నిర్మలుండై యుండు
నిజములాడు వాడు నీతిపరుడు
నిజము పల్కకున్న నీచ ఛండాలుండు
విశ్వదాభిరామ వినుర వేమ.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చండాలుడు&oldid=3882613" నుండి వెలికితీశారు