చంద్రగిరి శిఖరం (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రగిరి శిఖరం ముఖపత్రం

చంద్రగిరి శిఖరం పుస్తకం బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ బెంగాలీలో రచించిన నవలకు తెలుగు అనువాదం. ప్రకృతి చిత్రణలోనూ, జీవన తాత్వికతలోనూ ఈ రచయితకున్న విలక్షణ దృక్పథానికి చక్కటి ప్రతిబింబం ఈ నవల.

రచన నేపథ్యం[మార్చు]

బెంగాలీ రచయిత బిభూతిభూషణ్ బందోపాధ్యాయ బెంగాలీ భాషలో రచించిన చందేర్ పహార్ నవలకు ఈ పుస్తకం తెలుగు అనువాదం. అనువాదకురాలు, పత్రిక సంపాదకురాలు కాత్యాయని అనువదించిన ఈ నవలను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సంస్థ ప్రచురించింది. ఈ పుస్తకం మొదటి ముద్రణ ఆగస్టు 2010లో జరిగింది.

కథ[మార్చు]

సాహసికుడూ, భావుకుడూ అయిన బెంగాలీ యువకుడు ఆఫ్రికా అరణ్యాలలో చేసిన సాహస యాత్ర ఈ నవలలో వర్ణించబడినది. ఐతే ఈ నవలలో కేవలం కాలక్షేపాన్ని అందించే సాహసగాథల వంటిది కాదు. రచయిత విస్తృతమైన జీవితానుభవాలూ, ప్రకృతితో సాన్నిహిత్యమూ మానవ స్వభావాన్ని ఎంత ఉన్నతీకరిస్తాయో అతి సున్నితంగా చిత్రించాడు

ఆఫ్రికా అరణ్యాల్లోని ప్రమాధభరిత వాతావరణాన్నీ, ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణించిన ఈ రచన తెలుగు పాఠకులను ముగ్ధుల్ని చేస్తుంది.[1]

మూలాలు[మార్చు]

  1. "Chandragiri Shikharam". www.telugubooks.in (in ఇంగ్లీష్). Retrieved 2021-05-02.

బాహ్య లంకెలు[మార్చు]