Jump to content

చంద్రనాథ్ దేవాలయం

వికీపీడియా నుండి
చంద్రనాథ్ దేవాలయం
سادھ بھيلو
పర్వతంపై చంద్రనాథ్ దేవాలయం
పర్వతంపై చంద్రనాథ్ దేవాలయం
భౌగోళికం
దేశంబంగ్లాదేశ్ బంగ్లాదేశ్

చంద్రనాథ్ దేవాలయం (బెంగాలీ: চন্দ্রনাথ মন্দির), బంగ్లాదేశ్‌లోని సీతకుండ సమీపంలో ఉన్న చంద్రనాథ్ కొండలపై ఉన్న ఒక ప్రసిద్ధ శక్తి పీఠం. ఇది సముద్ర మట్టం నుండి దాదాపు 1,020 అడుగుల (310 మీ) ఎత్తులో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

సుమారు 800 సంవత్సరాల క్రితం గౌర్‌లోని ప్రముఖ ఆదిసూర్ వంశస్థుడైన రాజా విశ్వంభర్ సుర్ సముద్ర మార్గంలో చంద్రనాథ్ చేరుకోవడానికి ప్రయత్నించాడని అక్కడి రచనలు పేర్కొన్నాయి. నిగమకల్పతరు అనే కవి జయదేవ్ చంద్రనాథ్‌లో కొంతకాలం నివసించడాన్ని ఈ రచనలు సూచిస్తున్నాయి. త్రిపుర పాలకుడు ధన్య మాణిక్య కాలం నాటికి, చంద్రనాథుడు అనేక వరాలను పొందాడు. ధన్య మాణిక్య శివుని విగ్రహాన్ని ఆలయం నుండి తన రాజ్యానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు.[2]

పురాణాలు

[మార్చు]

పార్వతి మొదటి అవతారం, శివుని మొదటి భార్య సతీదేవి. ఆమె దక్ష రాజు, రాణి (బ్రహ్మ కుమార్తె)ల కుమార్తె. తన భర్తను, ఆమెను యజ్ఞానికి పిలవకుండా తండ్రి అవమానించినందుకు తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞం వద్ద ఆత్మాహుతి చేసుకుంది. తన భార్య మరణం గురించి విన్న తర్వాత శివుడు ఎంతగానో బాధపడ్డాడు, అతను సతీదేవి మృతదేహాన్ని తన భుజాలపై మోస్తూ తాండవ నృత్యం (విధ్వంసక తపస్సు లేదా నృత్యం)చేస్తూ ప్రపంచవ్యాప్తంగా తిరిగాడు. ఈ పరిస్థితితో కలత చెందిన విష్ణువు, శివుడిని సాధారణ స్థితికి తీసుకురావడానికి, తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతను సతీదేవి శరీరాన్ని చక్రంతో 51 ముక్కలుగా చేసి, ఆమె శరీరం భూమిపై ఎక్కడ పడితే అక్కడ సతీ (పార్వతి), శివ దేవతలతో కూడిన శక్తి పీఠానికి దివ్య క్షేత్రంగా ప్రతిష్టించబడింది. ఇవే పీఠాలుగా లేదా శక్తి పీఠాలుగా వెలసిల్లాయి. ఇవి ప్రస్తుత భారతదేశం లొనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌తో సహా భారత ఉపఖండం అంతటా ఉన్నందున ఈ ప్రదేశాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా మారాయి. సతీదేవిని దేవి లేదా శక్తి అని కూడా పిలుస్తారు. విష్ణువు ఆశీర్వాదంతో ఆమె హిమవత్ లేదా హిమాలయాల కుమార్తెగా పునర్జన్మ పొందింది. అందుకే పార్వతి (పర్వతాల కుమార్తె) అని పేరు పెట్టారు. ఆమె శివరాత్రి (శివుని రాత్రి) పండుగను సూచించే మృగశిర నక్షత్రం లో జన్మించింది.[3]

శక్తి పీఠంగా చంద్రనాథ్ దేవాలయం

[మార్చు]

చంద్రనాథ్ దేవాలయం ప్రసిద్ధ శక్తి పీఠంగా పరిగణించబడుతుంది, ఇటువంటి ప్రదేశాలు శక్తిని పూజించే దివ్యమైన పుణ్యక్షేత్రాలుగా మారాయి. శక్తి పీఠాల ఆవిర్భావం వెనుక దక్ష యాగం, సతీదేవి స్వీయ దహనం అనే పురాణ కథలు మూల కారణాలు. పరమశివుడు సతీదేవి శవాన్ని మోసుకుని దుఃఖంతో ఆర్యవర్తం అంతటా సంచరించినప్పుడు ఆమె శరీర భాగాలు పడిపోవడం వల్ల శక్తి పీఠాలు శక్తి కలిగిన దివ్య క్షేత్రాలుగా వెలసిల్లాయి. సంస్కృతంలోని 51 వర్ణమాలలకు 51 శక్తి పీఠాలు అనుసంధానించబడి ఉన్నాయి. ప్రతి ఆలయంలో శక్తి, కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. సతీదేవి దేహం కుడి చేయి ఇక్కడ పడిందని ప్రజలు నమ్ముతారు. శక్తిని భవానీ అనే పేరుతో పిలుస్తారు.

మూలాలు

[మార్చు]
  1. Dev, Prem Ranjan (2007-02-07). "Of Shiva Chaturdashi and Sitakunda". The Daily Star. Retrieved 2009-02-02.
  2. *Kapoor, Subodh (2002). The Indian Encyclopaedia: Biographical, Historical, Religious, Administrative, Ethnological, Commercial and Scientific. Cosmo Publications. p. 6325. ISBN 9788177552577.
  3. "Kottiyoor Devaswam Temple Administration Portal". Sree Kottiyoor Devaswom. Retrieved 2013-07-20.