Jump to content

చంద్రలత

వికీపీడియా నుండి
చంద్రలత Chandra Latha
జననం
మహబూబ్ నగర్
వృత్తిరచయిత, విద్యావేత్త,ప్రచురణకర్త

'చంద్రలత తెలుగు రచయిత, విద్యావేత్త, ప్రచురణకర్త.1997 లో ఈమె రాసిన రేగడి విత్తులు అనే నవలకు తానా వారి బహుమతి లభించింది.[1] నవలల రచనతో పాటు, చంద్రలత అనేక కథలు, సాహితీ వ్యాసాలు, సిద్ధాంత రచనలు, కథన విశ్లేషణలు, బ్లాగ్ రచనలు, పిల్లల పాటలు, తదితరాలు రచిస్తున్నారు. ప్రకృతి, విద్య, సాహిత్యం ప్రధాంశాలుగా కృషి చేసే  సంస్థ, ప్రభవ, స్థాపక నిర్వాహకులు.   [1] వీరు మడతపేజీ, [2] ప్రభవ [3] బ్లాగులు, చంద్రలత యూ ట్యూబ్ ఛానెల్ [4] నిర్వహిస్తున్నారు.

జీవితం

[మార్చు]

చంద్రలత నడిగడ్డలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.మహబూబ్ నగర్ లోనూ, హైదరాబాద్ లోను విద్యాభ్యాసం కొనసాగింది. బి.ఏ. ( 1989) లోనూ, ఎం. ఏ . (ఆంగ్ల సాహిత్యం) (1991) లోను, ఆయా విశ్వవిద్యాలయాల ప్రథములుగా బంగారుపతకాలు అందుకొన్నారు. ఆంగ్ల సాహిత్యం, కథన శాస్త్రంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు పొందారు. చంద్రలత పూర్వీకుల స్వగ్రామం గూడవల్లి (తెనాలి, గుంటూరు జిల్లా).ప్రస్తుత నివాసం నెల్లూరు. చిరకాలం హాసిటల్ అడ్మినిస్ట్రేటర్ గా వృత్తి నిర్వహించారు.దానితో పాటుగానే, విద్య, ప్రకృతి, సాహిత్యం ప్రధానాంశాలుగా కృషి చేసే, 'ప్రభవ' స్థాపక నిర్వాహకులు. రిషీవ్యాలీ పాఠశాల, తదితర విద్యాకేంద్రాలలో  సృజనాత్మక రచనలో అధ్యయన కార్యక్రమాలు నిర్వహించడం వీరి ప్రవృత్తి. బాలసాహిత్యంలో వీరు చేసిన కృషికి డా.మంగాదేవి బాలసాహిత్య పురస్కారం (2007) అందుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సాహితీ పురస్కారం (1998), తెలుగు విశ్వ విద్యాలయం నుంచి 2004 లో" డా. బి.అరుణ కుమారి ధర్మనిధి పురస్కారం" , 2006 లో "రచయిత్రి ఉత్తమ గ్రంథం (దృశ్యాదృశ్యం )", తెలుగుభాషకు చేసిన కృషికి "డెట్రాయిట్ లిటరరీ క్లబ్ గౌరవ పురస్కారం" (2008), సాహిత్యం ద్వారా వ్యవసాయ రంగానికి చేసిన కృషికి "మండవ ఫౌండేషన్ గౌరవ పురస్కారం" (2011), సాహిత్య కృషికి "పెద్దిభొట్ల సాహిత్య స్పూర్తి అవార్డ్" (2016), "ఎన్.టి.ఆర్ కళాపరిషత్ సాహితీ పురస్కారం" (2023)సాహితీ పురస్కారాలతో బాటు, మరెన్నో సాహితీ పురస్కారాలు అందుకొన్నారు.[2] [5]

రచనలు

[మార్చు]

చంద్రలత 1992 నుంచి కథలు రాస్తున్నారు . ఇవి పలు తెలుగు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 1994 లో నార్ల వారి పురాణ వైరాగ్యం పూరణ చేశారు. 1996 లో నేనూ నాన్ననవుతా అనే పేరుతో మొదటి కథల సంకలనం ప్రచురించారు . చంద్రలత మొదటి నవల 1996 లో వచ్చిన "వర్థని". 1997 లో వచ్చిన "రేగడి విత్తులు" అనే నవలకు తానా పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది.వీరి "వివర్ణం"కథ కు  ప్రతిష్టాత్మక" రంగవల్లి స్మారక పురస్కారం" (2006) అందుకొన్నారు.

నవలలు

[మార్చు]
  • అంతరంగాలు (నవలిక,1996)
  • వర్థని (1996)
  • రేగడివిత్తులు (1997)
  • దృశ్యాదృశ్యం (2003)
  • వాళ్ళు వీళ్ళు పారిజాతాలు (2016)
  • నీలంపు రాశి (2022)

కథా సంపుటాలు

[మార్చు]
  • నేనూ నాన్ననవుతా (1996)
  • ఇదం శరీరం (2004)
  • వివర్ణం (2007)
  • పిల్లలు మాయమైన వేళ (2019)
  • బొట్టెట్టి (2020)
  • Cracked Glass Jar (2023) English Translation by Dr. CLL Jayaprada

బాల సాహిత్యం

[మార్చు]
  • విరిగిన అల (2005)
  • పిల్లన గ్రోవి (2006)
  • పట్టు పువ్వులు (2006)
  • ప్రియమైన అమ్మా నాన్నా! (2006)
  • కథల ఒడిలో ( 2020)
  • గుటుక్కు గుటుక్  బ్రేవ్! (2021)
  • రవీంద్ర ఠాగూర్ కథల అనుసృజన (2018)

సాగు , ఇతర విషయాలు

[మార్చు]
  • ఆయువు పాట (2024)
  • To Tell a Tale (2018) కథన శాస్త్ర సిద్ధాంత గ్రంథం  
  • సస్యపథం
  • తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్తల జీవన పదం (2009)
  • చేపలెగరా వచ్చు (2009)
  • ఇతనాల కడవకు ఈబూది బొట్లు (2010)
  • వచ్చే దారెటు (2010)
  • మడతపేజీ (2010)

మూలాలు

[మార్చు]
  1. "రేగడి విత్తులు – చంద్రలత". pustakam.net. 25 April 2009. Retrieved 2009-04-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. K. N, Murali Sankar (3 March 2014). "'Novel' link to bifurcation". thehindu.com. The Hindu. Retrieved 11 May 2018.

వనరులు

[మార్చు]
  1. https://pustakam.net/?p=818
  2. https://www.teluguone.com/teluguvelugulu/index.
  3. https://www.amazon.in/Ratna-Books-Cracked-Translated-Jayaprada/dp/9355724624

jsp?filename=latha.htm

4. https://ratnabookseries.wordpress.com/cracked-glass-jar-and-other-stories/

"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రలత&oldid=4349041" నుండి వెలికితీశారు