రేగడివిత్తులు
రేగడివిత్తులు | |
కృతికర్త: | చంద్రలత |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నవల |
విభాగం (కళా ప్రక్రియ): | సాహిత్యం |
ప్రచురణ: | ఉత్తర అమెరికా తెలుగు సంఘం |
విడుదల: | 1997 |
పేజీలు: | 420 |
రేగడివిత్తులు 1997లో వెలువడిన ఒక తెలుగు నవల. దీనిని చంద్రలత రచించింది. ఈ నవలకు 1997లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి క్రింద 1.2 లక్షల రూపాయలు లభించింది.
రచయిత్రి సంక్షిప్త పరిచయం
[మార్చు]కథ
[మార్చు]రామనాథం గుంటూరు జిల్లా రేపల్లెకి చెందిన వ్యవసాయ కుటుంబంలోని వ్యక్తి. అతని అన్న రత్తయ్య ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రామనాథం చదువుకుని గవర్నమెంటులో ఆడిటరు ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ గలవాడు. మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ లో బీడువారిన నల్లరేగడి నేలను చూసిన రామనాథం ఆ భూమిలో వ్యవసాయం చేయాలనుకుంటాడు. సరైన పద్ధతిలో చేస్తే, వ్యవసాయం లాభదాయకమే అని నిరూపించాలని అతని కోరిక. తల్లిని, అన్నని ఒప్పించి, ఉమ్మడి ఆస్తిలో కొంత భాగం అమ్మి, పిల్లల్ని అన్న దగ్గర వదిలి భార్యతో కలిసి నడిగడ్డకి వచ్చిన రామనాథం ఓ దొర దగ్గర పొలంకొని అక్కడ వ్యవసాయం మొదలుపెడతాడు. కొంత కాలానికి, చదువు మానేసి వ్యవసాయంలోకి దిగిన అతని అన్న కొడుకు శివుడు రామనాథానికి తోడుగా వస్తాడు. మరికొంత కాలానికి కుటుంబం మొత్తం నడిగడ్డకి వలస వస్తుంది.
మంచి విత్తనం మాత్రమే మంచి పంటని ఇవ్వగలదని తెలుసుకున్న రామనాథం తన చదువుని, జ్ఞానాన్ని విత్తనాల తయారీలో ఉపయోగిస్తాడు. వ్యవసాయ శాస్త్రజ్ఞుల సలహాలతో కొత్త రకం పత్తి విత్తనాలు తయారు చేసి వాటికి ‘రేగడి విత్తులు’ అని పేరు పెడతాడు. పత్తి పంటకి గిరాకీ పెరగడంతో ఎక్కడెక్కడి వాళ్ళో నడిగడ్డ లో భూములు కొనడానికి డబ్బుతో వస్తారు. అతనున్న ప్రాంతం రాంనగర్ అవుతుంది.
ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడే రామనాధం వ్యవసాయంలోనే కాదు జీవితాల తోనూ ప్రయోగాలు చేస్తాడు. తన ఇంటి ఆడపిల్లను ఓ తెలంగాణా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కాలంతో పాటుగా, కొండొకచో కాలం కన్నా ముందుగా మారతాడు రామనాథం. ఆశావహ దృక్పథంతో ముగుస్తుంది కథ.
పాత్రలు
[మార్చు]- రామనాధం
- రత్తయ్య
- శివుడు