చంద్ర కుమార్ బోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్ర కుమార్ బోస్ భారతీయ రాజకీయవేత్త, వ్యాపారవేత్త. ఆయన భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు, శరత్ చంద్రబోస్ మునిమనవడు. కాగా ఆయన తండ్రి దివంగత అమియా నాథ్ బోస్, ఆరంబాగ్ నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.

ఆయన లండన్‌లోని హెండన్ కాలేజీలో ఎకనామిక్స్ చదివాడు. 1982లో కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందుకున్నాడు. ఆయన జంషెడ్‌పూర్‌లోని టాటా మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో కొంతకాలం ఉద్యోగం చేసి ఆ తరువాత బోస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రారంభించాడు.

2016 జనవరి 23న హౌరాలో జరిగిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. అయితే నేతాజీ దార్శనికతను ప్రచారం చేస్తామన్న హామీని ఆ పార్టీ నిలబెట్టుకోలేదని ఆయన భాజపా నుంచి 2023 సెప్టెంబరు 6న తన సభ్యత్వానికి రాజీనామా చేసాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Chandra Bose: భాజపాను వీడిన నేతాజీ మనవడు | netajis grandnephew resigns from bjp". web.archive.org. 2023-09-06. Archived from the original on 2023-09-06. Retrieved 2023-09-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)