చంద్రవంక

వికీపీడియా నుండి
(చంద్ర వంక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చంద్రవంక.
ఈ చిత్రంలో ఒక చొన్న వృత్తం, ఒక పెద్ద వృత్తం లోని భాగాన్ని మూసేసింది.

చంద్రుడి దశలను సూచించే చిత్రాన్ని చంద్రవంక అంటారు. దీన్ని నెలవంక అని కూడా అంటారు. తెలుగు సాహిత్యంలో చంద్రుణ్ణి నెలరాజు అని అనడం కద్దు. అమవాస్య తరువాత వచ్చే తొలి చంద్రోదయాన్ని నెలపొడుపు అని అంటారు. జ్యోతిష శాస్త్రంలో చంద్రుడిని సూచించే చిహ్నంగా చంద్రవంకను వాడుతారు. హిందూ ధర్మంలో శివుడి చిత్రాల్లో తలపై ఉండే చంద్రుణ్ణి సూచించేందుకు చంద్రవంకను చూపిస్తారు. రోమన్ కాథలిక్ మతంలో దీన్ని కన్య మేరీకి సూచికగా వాడుతారు. ఇస్లాములో కూడా చంద్రవంకకు ప్రాముఖ్యత ఉంది. మసీదు మీనార్ల శిఖరాలపై చంద్రవంక ఆకారాన్ని అమర్చుతారు. ఇంగ్లీషులో దీన్ని క్రీసెంట్ అంటారు.

చంద్రవంకను జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి చిహ్నంగాను, రసవాదంలో వెండికి గుర్తు గానూ చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. [1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Alchemy and Symbols, By M. E. Glidewell, Epsilon.
"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రవంక&oldid=3647388" నుండి వెలికితీశారు