చక్కలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెక్క భజన
హైదరాబాదులో చిరుతల భజన చేస్తున్న కళాకారులు

చిరుతలు వీటినే కొన్ని ప్రాంతాలలో చక్కలు అని అంటారు. వీటిని హరిదాసులు ఎక్కువగా వాడుతారు. భజనలు చేసేవారు కూడా వాడుతారు. ఇలా చక్కలు వాయిస్తూ చేసే భజనను చక్కభజన అని అంటారు. భజనలు చేసేవారు వాడే చెక్కలు కొంత పెద్దవిగానూ, ఆ చెక్కలలో గజ్జెలు మొదలవు వానిని అమర్చి వుంటాయి. వాటిని వాయిస్తున్నప్పుడు చప్పుడు వస్తుంది. దానికనుగుణంగా వారు భజన పాటలను పాడుతారు. దానినే చెక్కభజన అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో రాంభజన అని కూడా అంటారు. ఈ రామభజనలు, చెక్క బనజలు వివిధ ప్రాంతీయ నామాలతో తెలుగు రాష్ట్రాలలో విస్త్రుతంగా వ్యాప్తిలో ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=చక్కలు&oldid=2985054" నుండి వెలికితీశారు