Jump to content

చక్రతా

అక్షాంశ రేఖాంశాలు: 30°42′07″N 77°52′08″E / 30.702°N 77.869°E / 30.702; 77.869
వికీపీడియా నుండి
చక్రతా
పట్టణం
చక్రతా is located in Uttarakhand
చక్రతా
చక్రతా
భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లో స్థానం
చక్రతా is located in India
చక్రతా
చక్రతా
చక్రతా (India)
Coordinates: 30°42′07″N 77°52′08″E / 30.702°N 77.869°E / 30.702; 77.869
దేశంభారతదేశం ( India)
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాడెహ్రాడూన్
Elevation
2,118 మీ (6,949 అ.)
జనాభా
 (2001)
 • Total3,498
భాషలు
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUK
బుధేర్ ఫారెస్ట్ రెస్ట్ హౌస్ వద్ద పొగమంచు

చక్రతా భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లాలో ఉన్న నగరం.[1] ఇది సముద్ర మట్టానికి 2118 మీటర్ల (6949 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుండి 98 కి.మీ.ల దూరంలో ఉంది. చక్రతా మొదట బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ   కంటోన్మెంట్. ఈ నగరానికి పశ్చిమాన హిమాచల్ ప్రదేశ్, తూర్పున ముస్సోరీ (73 కి.మీ), టెహ్రీ గర్వాల్ ఉన్నాయి .

కంటోన్మెంట్

[మార్చు]

మొదట్లో ఈ ప్రాంతాన్ని జాన్సర్ బౌర్ అని పిలిచేవారు.[2] ఇక్కడ నివసించే జాన్సారి తెగ నుండి ఈ పేరు వచ్చింది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్, 1869లో[3] 55వ రెజిమెంట్, బ్రిటీష్ ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ హ్యూమ్ చేత స్థాపించబడింది.[4] ఇక్కడి వాతావరణాన్ని చూసి బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని సమ్మర్ ఆర్మీ బేస్ గా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆర్మీ సిబ్బందికి, కమాండోలకు శిక్షణ ఇస్తున్నారు. చక్రతా ఒక నియంత్రిత కంటోన్మెంట్ ప్రదేశం. చాలా పరిమితులతో మాత్రమే పర్యాటకులు ఇక్కడికి అనుమతించబడతారు. చక్రతా అనేది ప్రత్యేక సరిహద్దు దళ ప్రధాన కార్యాలయం, ఇది భారత సైన్యానికి సంబంధించిన అత్యంత విశేషమైన టిబెటన్ దళం. ఇది ఎస్టాబ్లిష్‌మెంట్ 22 లేదా టూ -టూ అని పిలువబడే టిబెటన్ దళం. ఇది 1962లో చైనా-భారత్ యుద్ధం తర్వాత ఏర్పడిన దళం.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[5] చక్రతా పట్టణంలోని మొత్తం జనాభా 5,117 మంది, ఇందులో 3,717 మంది పురుషులు, 1,400 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 377 మంది స్త్రీలు ఉన్నారు. 367 (7.17%) 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు. సగటు అక్షరాస్యత 90.38%. జనాభాలో హిందువులు 57.30%, ముస్లింలు 1.54%, బౌద్ధులు 38.28%, జైనులు 0.80%, క్రైస్తవులు 0.68%, ఇతరులు 0.12% ఉన్నారు.[6] ఈ పట్టణంలో హిందీతో పాటు ప్రాంతీయ భాష అయిన జౌన్సారి కూడా మాట్లాడతారు.

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

చక్రతాకు డెహ్రాడూన్ నుండి ముస్సోరీ లేదా వికాస్‌నగర్ మీదుగా కల్సి గేట్ (అశోక స్థంభం ఉన్న ప్రదేశం) గుండా చేరుకోవచ్చు.

చక్రతా సమీపంలోని ప్రధాన ఆకర్షణలు:

టైగర్ ఫాల్స్

[మార్చు]

ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన జలపాతాలలో ఇది ఒకటి. ఇది చక్రతా నుండి 20 కి.మీ దూరంలో ఉంది, 312 అడుగుల ఎత్తులో ఉంది.

బుధేర్ (మొయిలా దండా)

[మార్చు]

ఇది 2800 మీటర్ల ఎత్తులో ఉన్న పచ్చికభూమి. బుధేర్ కార్స్ట్ ప్రకృతి దృశ్యాలు పురాతన సున్నపురాయి గుహలకు నిలయంగా ఉన్నాయి.

కనసర్

[మార్చు]

ఇది ఆసియాలో అత్యుత్తమైన దేవదార్ అడవులలో ఒకటిగా ఉంది. ఇది చక్రతా సమీపంలోని ఉత్తమ పిక్నిక్ స్పాట్‌లలో ఒకటి. కనసర్‌లోని ఒక ఫారెస్ట్ రెస్ట్ హౌస్, కొన్ని గుడారాల వసతి సందర్శకులు ముందస్తు బుకింగ్‌పై ఇక్కడ ఒక రాత్రి గడపడానికి వీలు కల్పిస్తుంది.

చిల్మిరి

[మార్చు]

ఇది సూర్యాస్తమయం పాయింట్. చక్రతా మార్కెట్ నుండి 4 కి.మీ దూరంలో ఉంది.

దేవబన్

[మార్చు]

దాదాపు 2900 మీటర్ల ఎత్తులో ఉన్న దేవబన్ నుండి హిమాలయాలను చూడవచ్చు.

ముండలీ పచ్చికభూములు

[మార్చు]

ఇక్కడ శీతాకాలపు క్రీడలు జరుగుతాయి.

లఖమండల్

[మార్చు]

ఇది పురాతన దేవాలయ సముదాయం. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిత ప్రదేశం.

బైరత్ ఖై (ది ప్రిన్సెస్ ఆఫ్ హిల్స్)

[మార్చు]

దీనిని బైరత్ ఖాయ్ పాస్ అని కూడా పిలుస్తారు, చక్రతాకు తూర్పున 25 కి.మీ దూరంలో ఉంది, బైరత్ ఖై పాస్ ఉత్తర, దక్షిణ భాగంలో లోతైన లోయలను కలిగి ఉంది.

మంజ్‌గావ్

[మార్చు]

ఇది పురాతన శివాలయం. దీనిని ప్రాంతీయ భాషలో మస్సు దేవత అంటారు. ఇది చక్రతా మార్కెట్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఈ ప్రాంతంలోని పురాతన దేవాలయం.

మూలాలు

[మార్చు]
  1. Chisholm, Hugh, ed. (1911). "Chakrata" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press..
  2. Chakrata Tahsil & Town The Imperial Gazetteer of India, 1909, v. 10, p. 125.
  3. "History – CHAKRATA CANTONMENT BOARD". chakrata.cantt.gov.in. Retrieved 2021-05-18.
  4. Chakrata Archived 29 సెప్టెంబరు 2008 at the Wayback Machine Official website of Dehradun city.
  5. "Census of India 2011: Data from the District Handbook" (PDF). Census India. Census Commission of India. Retrieved 10 April 2020.
  6. "District Census Handbook 2011" (PDF). Census India. Retrieved 10 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=చక్రతా&oldid=3931861" నుండి వెలికితీశారు