చమత్కార మంజరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చమత్కార మంజరి సింహాద్రి వెంకటాచార్యులు రచించిన కావ్యం. ఇతడు గోదావరి మండలానికి చెందిన శ్రీవైష్ణవ కులస్తుడని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ గ్రంథంలోని పద్యాలను అప్పకవికి పూర్వులైన లాక్షణికులు ఉపయోగించకపోవడం చేసి, ఈ గ్రంథకర్త దాదాపు 1630-40ల నడుమ గ్రంథ రచన చేసివుంటారని నిర్ణయించారు. కవి ఈ కావ్యాన్ని వైష్ణవ మతోద్ధారకుడైన శ్రీ రామానుజాచార్యులు వారికి అంకితమిచ్చెను.

ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు 1900 సంవత్సరంలో తమ చింతామణీ ముద్రణాశాల ద్వారా ప్రచురించగా, అనంతర కాలంలో ఈ ప్రతిని జానపాటి పట్టాభిరామశాస్త్రి ముద్రించారు.

దీని మొదటికూర్పు 1911 సంవత్సరం శ్రీభారతీవిలాస ముద్రాక్షరశాల, నర్సారావుపేట వారిచే ముద్రించబడి ప్రచురించబడింది.

మొదటి పద్యం[మార్చు]

శా. శ్రీరామాధిప భోగ్య వస్తుకల నా సిద్ధ ప్రదీపంబు సం
సారాంబోనిధి గాఢ సేతు వురు మోక్షశ్రీ మృగాక్షీ నశీ
కారాద్యౌషధ మాగమ క్షితిజ శాఖా చిత్రమై యొప్పు మా
శ్రీమానుజ దివ్య శాసనము వర్ధిల్లుం దిగంతంబులన్

మూలాలు[మార్చు]