Jump to content

చమన్ లాల్ గుప్తా

వికీపీడియా నుండి

చమన్ లాల్ గుప్తా (13 ఏప్రిల్ 1934 - 18 మే 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

చమన్ లాల్ గుప్తా ఏప్రిల్ 13, 1934న జమ్మూలో జన్మించాడు. ఆయన జిజీఎం సైన్స్ కాలేజ్ జమ్మూ, అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

చమన్ లాల్ గుప్తా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1972లో జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1987లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉధంపూర్ నియోజకవర్గం నుండి 11వ లోక్‌సభకు, 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 12వ లోక్‌సభకు, 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 13వ లోక్‌సభకు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యాడు. చమన్ లాల్ గుప్తా 1999 అక్టోబర్ 13 నుండి 2001 సెప్టెంబర్ 1 వరకు కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రిగా, 2001 సెప్టెంబర్ 1 నుండి 2002 జూన్ 30 వరకు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర బాధ్యత), 2002 జూలై 1 నుండి 2004 వరకు రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

చమన్ లాల్ గుప్తా 2008 నుండి 2014 వరకు జమ్మూ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1972–77 జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
  • 1987–90 జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు & సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ; పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ;
  • 1973–80 జనరల్-సెక్రటరీ, భారతీయ జనసంఘ్ (BJS), జమ్మూ కాశ్మీర్
  • 1980–89 జనరల్ సెక్రటరీ, భారతీయ జనతా పార్టీ (BJP), జమ్మూ కాశ్మీర్
  • 1990–95 అధ్యక్షుడు, BJP, జమ్మూ కాశ్మీర్ (రెండు పర్యాయాలు)
  • 1996 ఉధంపూర్ నుండి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
  • 1996–97 రవాణా, పర్యాటకంపై కమిటీ సభ్యుడు
  • 1998 12వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వసారి)
  • 1998–99 వక్ఫ్ బోర్డు పనితీరుపై జాయింట్ కమిటీ సభ్యుడు
  • 1999 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (3వసారి)
  • 1999–2001 కేంద్ర సహాయ మంత్రి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
  • 2001–2002 కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఆహార మంత్రిత్వ శాఖ
  • 1 జూలై 2002 – 2004 కేంద్ర సహాయ మంత్రి, రక్షణ మంత్రిత్వ శాఖ
  • 2008-2014 సభ్యుడు, జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ జమ్మూ వెస్ట్

ప్రచురించబడిన పుస్తకాలు

[మార్చు]
  • సంసద్ మే జమ్మూ కాశ్మీర్;
  • సంసద్ మే దేద్ వర్ష్;
  • మేరే ప్రయాస్
  • ఆర్టికల్ 370: ఒక ముల్లు

మరణం

[మార్చు]

చమన్ లాల్ గుప్తా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యం విషమించడంతో 18 మే 2021న మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (18 May 2021). "Former Union Minister and BJP leader Chaman Lal Gupta passes away" (in Indian English). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. India Today (18 May 2021). "Former union minister and BJP leader Chaman Lal Gupta passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.