Jump to content

చర్చ:ఆత్మ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసానికి మూలల గురించి అడిగారు. సేను 15 సంవత్సరాలుగా ఎంతో మంది మహాత్ముల ప్రసంగాలు వింటూ విషయాలు రాసుకుంటూ ఉన్నాను. ఇంకా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మాసపత్రికలు ఇలా అన్నింటినుండి కొంచెం కొంచెంగా వివరణలు సేకరిస్తూ, వాటన్నిటినీ కూర్చి ఒక వ్యాసం లాగ తయారుచేస్తున్నాను. ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం చాలా మందిలో ఉన్నా, ఎక్కడైనా విన్నా లేక చదివినా, అంతతొందరగా అర్థం కాక, ఆ జిగ్నాస ఉన్నవారి సహనానికి ఒక పరిక్షలాగ ఉండి, చివరకు విసుగు కలిగి ఒదిలివేసే పరిస్థితి వస్తోంది. కనుక అందరికీ సరళమైన పద్ధతిలో ఉండేలాగ, ఆశక్తిని కలిగించేదిగా, చదివిన ప్రతీవారు కూడా రోజువారీ జీవితంలో ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకొనేలా చేయాలని నా ఉద్దేశ్యం. ఇంకా ఈ వ్యాసాన్ని ఉదాహరణలతో సహా విస్తరిస్తాను. సహజంగా ఉదాహరణలు అంటే పురాణకథలు అవీ చెపుతారు. కానీ నా ఉద్దేశ్యం, మామూలు సామాన్య మానవుని రోజువారీ జీవిత సంఘటనలను వస్లేషించి, వివరిస్తే అందరికీ సులభంగా ఉంటుందని నా ఉద్దేశ్యం. మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను. ఇప్పడివరకూ వ్రాసిన దానిలో ఎక్కడి నుండి పూర్తిగా ఒక వాక్యంగా తీసినది ఏదీలేదు. మూలాలను ఎలా వివరించను ? ఈ విషయంలో కూడా సహకరించండి.madhuriprakash 04:53, 18 డిసెంబర్ 2007 (UTC)మాధురీరావ్2007

మాధురీరావు గారు! మూలాలనేవి విషయనిర్దారణకు ఉపయోగపడతాయి. మీరు మీకు తెలిసిన విషయాన్ని రాసారు, కానీ అందరూ దాన్ని నమ్మలేరు కదండి. లైన్ కాపీ చేస్తేనే మూలం ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. నిజానికి అలా లైన్ కాపీ చేస్తే కాపీ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వికీపీడియాలో స్వంత అభిప్రాయాలు రాయడం నిషేధం. మీరు కావాలంటే వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం లింకును చదవండి.దేవా/DeVచర్చ 05:05, 18 డిసెంబర్ 2007 (UTC)
మాధురీరావుగారూ, మీ ఉద్దేశం బాగుంది. కానీ వికీపీడియాలాంటి విజ్ఞాన సార్వస్వంలో మన సొంత రచనలు లేదా సొంత పరిశోధనలు ఉండకూడదు. ఏ విశయంలోనయినా ఇప్పటికే ఎంతో మంది పరిశోధనలు చేసేసి ఉంటారు. అలా అప్పటికే ఉన్న పరిశోధనల సమగ్రరూపం మాత్రమే విజ్ఞాన సార్వస్వంలో ఉంటుంది. దీనర్ధం ఏమిటంటే వికీపీడియా కొత్త కొత్త పరిశోధనలకు వేదిక కాదు. ఇప్పటికే ఉన్న పరిశోధనల వివరాలను మాత్రమే ఇక్కడ చేరుస్తాము. మనకు సరైనవనిపించిన చాలా వివరాలు కొంతమందికి తప్పనిపించవచ్చు. అందుకనే ప్రతీదానికి రుజువులుగా మూలాలను చేర్చాలి. అందుకనే ఏ విశయాన్నయినా చేర్చేముందు, అది సరయినదా కాదా అని నిర్ధారించుకోవడానికి రుజువుల కోసం వెతకాలి, రుజువులు దొరికికిన తరువాతనే దానిని చేర్చండి. లేకపోత వ్యాసానికి విశ్వాసనీయత ఉండదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:09, 18 డిసెంబర్ 2007 (UTC)


ఇది నా సొంత రచన కాదు. కానీ చాలా గ్రంథాలు, వేదాలు,ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ముఖ్యంగా భగవద్గీత, ఇంకా పూరీ శంకరాచార్యులవారి ఉపన్యాసాలు, కంచి శంకరాచార్యులవరి ఉపన్యాసాలు, వారిని అడిగే ధర్మసందేహాలకు వారిచ్చిన సమాధానాలు, వారి పీఠాలనుండి ఇంకా ఇతర పీఠాలనుండి వెలువడే ఆధ్యాత్మిక పత్రికల వ్యాసాలు ఇలా అన్నిటి నుండి తీసుకుని వాని సారాంశాన్ని ఇక్కడ కూర్చుతున్నాను. ఎందుకంటే ఈ విషయం అంతసులభంగా అర్థం అయ్యేదికాదు. పై వానిలో చెప్పింది అలాగే ఇవ్వాలంటే కూడా సరళమైన రీతిలో ఉండదు. పైగా కాపీరైట్ గొడవలు కదా! శంకరాచార్యులవారి ఉపన్యాసాలలో వారు సామాన్యులకు అతి సులభంగా అర్థమయ్యే రీతిలో వివరణలు ఇచ్చారు. ఆవిధంగానే ఇస్తే అవికొంత ఆలోచింపజేసేవిగా ఉంటాయి అని నా అభిప్రాయము. మెల్లగా వాటన్నిటినీ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఈ వ్యాసంమీద ఇంకా చర్చ జరిగి ఒకరికొకరు సహరించుకుంటూ ముందుకుసాగుదాం. madhuriprakash 03:20, 19 డిసెంబర్ 2007 (UTC)మాధురీరావ్2007

మూలాలంటే పెద్ద సీనేంలేదండి ఉదాహారణకి "ఈ జీవాత్మే 'ఆత్మ. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు" అన్న వాక్యము తీసుకుంటే ఇది భగవద్గీతలోని జ్ఞానయోగములోని ఒక శ్లోకము. అది ఏ శ్లోకమో రాస్తే సరి (ఇలా. భగవద్గీత జ్ఞానయోగము 11వ శ్లోకము)--వైజాసత్య 06:34, 19 డిసెంబర్ 2007 (UTC)
    • ఆత్మ గురించి మంచి వ్యాసం తయారుచేయడానికి ఇది మూలం అవుతుంది. దీనిని ఆపవద్దు. వ్రాసిన విషయాలు చెప్పిన మహానుభావులను కోట్ చేస్తే సరిపోతుంది నా అభిప్రాయం. చాలా వరకు భారతీయ పురాణ మరియు ఆధయాత్మిక విషయాలకు రిఫరెన్సులు వ్రాయడం కష్టం. అలాగని ఈ భావాలను తెలియజేయడాన్ని ఆపవద్దు.Rajasekhar1961 07:03, 19 డిసెంబర్ 2007 (UTC)

ఆత్మ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:ఆత్మ&oldid=216858" నుండి వెలికితీశారు