చర్చ:కడుపులో పుండు
వ్యాధి లక్షణాలు
కడుపు నొప్పి: ఈ నొప్పి వివిధ సమయాలలో వస్తుంది. దీనిని బట్టి జీర్ణవ్యవస్థలో పుండు ఎక్కడ ఉందో ఒక అంచనాకు రావచ్చును. ఆహారం తీసుకొంటున్నప్పుడే నొప్పి వస్తుంటే అన్నవాహికలోను, అహారం తీసుకున్న వెంటనే వస్తుంటే పుండు జీర్ణకోశంలోను, మధ్యరాత్రి వస్తే డుయోడినమ్ లోను పుండు ఉందని అనుమానించవచ్చును. రక్తస్రావం: పుండు నుండి రక్తం చాలా ఎక్కువగా పోవచ్చు. మలం నల్లగా రావడం, రక్తపు వాంతులు కావచ్చు. కొన్నిసార్లు పైకి ఏమీ కనబడకుండానే రక్తం నెమ్మదిగా పోయి తీవ్రమైన రక్తహీనతలోనికి వెళ్ళవచ్చును. పేగులకు రంధ్రాలు: వీటి మూలంగా పేగులలోని పదార్ధాలు బయటికి వచ్చి ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది. కొందరికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది. పేగు సన్నబడటం: కొన్ని పుండ్లు ఉన్న ప్రదేశంలో మానిపోయిన తర్వాత అక్కడ పేగు సన్నబడి ఆహారానికి అడ్డం పడుతుంది. [మార్చు]
కడుపులో పుండు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కడుపులో పుండు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.