చర్చ:కమ్యూనిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg కమ్యూనిజం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 25 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

ఈ వారం వ్యాసంగా[మార్చు]

కమ్యూనిజం వ్యాసం చాలా మంది కలసి అనేక విషయాలు వివరంచిన వ్యాసం. ఇప్పుడు పరిపూర్ణమయిన స్తితికి వచ్చిందన్న అభిప్రాయంలో, ఈ వ్యాసాన్ని 2008లో 24వ వారానికి, "ఈ వారం వ్యాసం" గా ప్రతిపాదిస్తున్నాను.--SIVA 18:12, 6 జూన్ 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సుత్తి, కొడవలి చిహ్నం[మార్చు]

కమ్యూనిజం అనే అలోచనా ధొరణికి గుర్తు అనేది ఉంటుందా?? రాజకీయ పార్టీలకు అయితే గుర్తు ఉంటుంది. మనం వ్రాసే వ్యాసం కమ్యూనిజం గురించి కానీ కమ్యూనిస్ట్ పార్టీ గురించికాదుకదా!వ్యాంసంలో సుత్తీ కొడవలిని కమ్యూనిజంకుగుర్తు అనివ్రాసి ఒక చిహ్నాన్ని ఉంచారు. ఎంతవరకు ఇది సమంజసం.--SIVA 00:47, 23 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]


మీరన్నది నిజమే[మార్చు]

శివ గారూ! మీరన్నది నిజమే.కమ్యూనిజం అనే ఆలోచనా ధోరణికి గుర్తు ఉండదు. బొమ్మను ఉంచిన తరువాత ఏదో ఒక వివరం రాయాలి కనుక మరోటి అప్పటికి తోచక అలా రాసాను.నాకూ ఆ మాట తృప్తికరంగా లేదు.ఈ బొమ్మ వికీమీడియా కామన్స్ లోనిది.అక్కడ బొమ్మ వివరంలో సింబల్ ఆఫ్ కమ్యూనిజం అని ఉన్నది.అందుకే అలా రాసాను.సింబల్,ఎంబ్లం,చిహ్నం,ప్రతీక ఇవి ఏవీ కూడా సరైనవి కాదని అనిపిస్తున్నది.అందుకే సింబల్ అనే పదాన్ని తొలగించాను.ప్రస్తుతానికి బొమ్మ కు వివరణ గా కమ్యూనిజం అనే పదం మాత్రమే ఉనది. మీ అభ్యంతరం సింబల్ అనే పదం యెడల కాక అసలు ఆ బొమ్మ అక్కడ ఉండటం లోని ఔచిత్యం యెడల ఐనట్లయితే దానికి నావివరణ.సుత్తి-కొడవలి గుర్తు ను చూడగానే ఎవరికైనా సామ్యవాదమే స్ఫురిస్తుంది.ఆ గుర్తుకు ఆ వాదానికి ఉన్న అనుబంధం మీకు తెలియదని అనుకోను.అందుకే ఆ చిహ్నం అక్కడ ఉంచాలనుకున్నాను.ఆంగ్ల వికీపీడియా ను అనుసరిస్తూ కూడా నేను ఆగుర్తును అక్కడ ఉంచాను.వారు ఆ చిహ్నం తోపాటు చాలా సమాచారం పొందుపరచారు.అదంతా ఇక్కడ ఉంచటం నాకు తెలియలేదు.నాకు తెలిసినది చేసాను. Saraswathi Kumar 08:20, 23 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పైన నేను చేసిన వాఖ్య ఉద్దేశ్యమిది. మనం వ్రాసే వ్యాసం కమ్యూనిజం గురించి మాత్రమే. కమ్యూనిజం అనేది ఒక జీవన విధానం అనుకుంటే, జీవన విధానానికి చిహ్నం (సింబల్) మనం ఉంచాలంటారా. వ్యాసంలో ఉంచిన చిహ్నం సుత్తీ, కొడవలి అనేక కమ్యూనిస్ట్ పార్టీలలో ఏదో ఒక దానిదయి ఉంటుంది.ఈ వ్యాసం కమ్యూనిస్ట్ పార్టీ గురించి కాక, కమ్యూనిస్ట్ జీవన విధానం గురించి కదా, చిహ్నం ఉంచాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఏమంటారు--SIVA 10:56, 23 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

బొమ్మకు జస్టిఫికేషన్[మార్చు]

శివగారూ!బొమ్మ వివరాన్ని శ్రామిక వర్గానికి ప్రతీక అని మార్చాను.ఇప్పుడు బొమ్మ జస్టిఫై అయిందనుకుంటున్నాను.Saraswathi Kumar 12:01, 23 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

బొమ్మకు కొంచెం పొడవు వ్యాఖ్య వ్రాశాను. హైదరాబాదుకు చెందిన ఒక బొమ్మ కూడా కలిపాను. సముచితమో కాదో మీ అభిప్రాయం చెప్పండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:56, 23 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]
కాసుబాబుగారూ! కమ్యూనిజంకూ కమ్యూనిస్ట్ పార్టీకి చాలా తేడా ఉన్నదని నా ఉద్దేశ్యం. ఒకటి జీవన విధానంగా ప్రతిపాదించబడినది, రెండవది, ఆ పేరుమీద అధికారం కొరకు ప్రయత్నించే రాజకీయ పార్టీలు. జీవన విధానానికి చిహ్నం ఏమి పెట్టగలం. సుత్తీ కొడవలి కమ్యూనిజంకు గుర్తయితే, కాపిటలిజంకు చిహ్నం ఏమిటి?? అందుకని నా ఉద్దేశ్యంలో కమ్యూనిజం వ్యాసంలో, కమ్యూనిస్ట్ పార్టీ/లకు చేందిన చిహ్నాలు చేర్చటం సముచితం కాదేమోనని.--SIVA 16:22, 23 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]
గమనించండి. ఇది నిర్వాహక నిర్ణయం కాదు. అభిప్రాయం మాత్రమే.
  • ఆంగ్ల వికీలో ఈ బొమ్మ ఉండడం సంగతి అలా ఉంచండి. శివా వ్యాఖ్యలో కొంత ఔచిత్యం ఉన్నదనిపిస్తున్నది. రెండు విధాలుగానూ వాదించవచ్చును. ఎందుకంటే 'కమ్యూనిజం' అనేది కమ్యూనిస్టు పార్టీల ప్రాధమిక తత్వం (అని వారు చెప్పుకొంటారు). కనుక కమ్యూనిజం అంటే సుత్తీ కొడవలీ స్ఫురణకు రావడం సహజం.
  • కమ్యూనిస్టు పార్టీల గురించి వేరే వ్యాసం మొదలైనప్పుడు ఈ బొమ్మ మారుద్దాము. ప్రస్తుతానికి ఈ వ్యాసంలో ఉంచడం అనుచితం కాదనుకొంటాను.
  • వ్యాసాల గురించిన చర్చ ఆయా వ్యాసాలలోనే వ్రాస్తే తరువాత ఇతర రచయితలు, చదువరులు తరువాతి కాలంలో చూసే అవకాశం ఎక్కువ. ఈ విషయాలపై నిర్వాహకులకు ప్రత్యేకమైన పాత్ర లేదు. ఎవరివైనా సలహాలు కావాలంటే 'ఫలాని చర్చా పేజీ చూడండి' అని ఒక చిన్న సందేశం వారికివ్వండి.
  • కేపిటలిజమ్ చిహ్నమా? డబ్బు! డబ్బు! డబ్బు డబ్బు!

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:53, 23 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]


కాసుబాబు గారూ!మీరు చేసిన మార్పులు సముచితంగా ఉన్నాయి.ధన్యవాదములు.Saraswathi Kumar 07:58, 24 మార్చి 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

బొమ్మల చేరిక[మార్చు]

వ్యాసం కమ్యూనిజం గురించి మాత్రమేనని, కమ్యూనిస్ట్ పార్టీ గురించి కాదని వ్యాస ప్రధమ భాగంలో ప్రకటిస్తూనే, వ్యాసంలో ఒక ప్రాంతములోని కమ్యూనిస్ట్ పార్టీ ఊరేగింపు దృశ్యాలు వారి జండా గుర్తులతో సహా జత పరచటం సముచితంగాలేదని నా అభిప్రాయం. దీని బదులుగా, భారత దేశంలో కమ్యూనిజం ప్రాబల్యం, వ్యాప్తి గురించి వ్యాసంలో వ్రాస్తే, వ్యాస పరిణితి పెరుగుతుందనిపిస్తున్నది. మరొక్క సారి పరిశీలిస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం.--SIVA 08:25, 15 జూన్ 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీ వ్యాఖ్యలు ఓకే కాని ప్రస్తుతానికి కొంత రాజీ అవుసరం అనుకొంటాను. (1) వ్యాసం మొదట్లో ఆ కామెంట్ అంత అవసరమా అనిపిస్తున్నది. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ గురించి వేరే వ్యాసం ఇప్పటికి లేదు గనుక. (2) ఈ వ్యాసాన్ని ఇంకా పెంచడం కష్టం. ఇప్పటికే పొడవయ్యింది. భారతదేశంలో కమ్యూనిజం అనే వేరే వ్యాసం ఎవరైనా వ్రాస్తే మీ వ్యాఖ్యలు సంపూర్ణంగా అమలు చేయవచ్చును. (3) అన్నీ అంతర్జాతీయ బొమ్మలే ఉన్నాయి అని లోకల్ ఫ్లేవర్ కోసం ఆ బొమ్మలు పెట్టాను. అందులోనూ విషయ సూచిక ప్రక్కన ఆ పెద్ద స్పేస్ ఖాళీగా కనిపించింది. (4) బొమ్మలు తొలగించడానికి నాకు అభ్యంతరం లేదు. ఇంకెవరైనా తమ అభిప్రాయం చెబుతారేమో కొంచెం ఆగుదాం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:07, 15 జూన్ 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వ్యాసం మొదట్లో, వ్యాఖ్య అవసరమే. ఎందుకంటే కమ్యూనిజం, కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటి ఎప్పటికి కావు కాలేవు. కమ్యూనిస్ట్ పార్టీల గురించి వ్రాయాలంటే ఇంకా చాలా పరిశోధన చెయ్యాలి. కారంణం, అసంఖ్యాకంగా ఉన్న కమ్యునిస్ట్ పార్టీలు. వాటి సంఖ్య ప్రతి దేశంలోనూ బహువచనంలోనే ఉంది. కాబట్టి, మీ రన్నట్టు, దేశీ వాసన రావాలంటే, బారత దేశంలో కమ్యూనిజం గురించి డాంగే, సుందరయ్య వంటి నాయకుల గురించి వ్రాయాలి.

ఇప్పుడే మళ్ళీ పాత చర్చలు చదివాను. సరదాగా వ్రాస్తున్నాను. కమ్యూనిజం జీవన విధానమా? వట్టి సుత్తి. నిజమైన ఆచరణలో జరిగేది ఏంటంటే అధికారాన్ని హస్తగతం చేసుకొనేందుకు వాడే ఊదరగొట్టు పదజాలం మాత్రమే అనిపిస్తుంది నాకు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:13, 15 జూన్ 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కాసు బాబుగారూ! మీ వ్యాఖ్య చూసి చాలా నవ్వుకున్నాను ("సుత్తి" అని చూసి). ఆలోచనా ధోరణిలో , నేను కమ్యూనిస్ట్ ను ఎంత మాత్రం కాదు. కాని, ఒక విషయం గురించె వ్యాసాన్ని వ్రాస్తున్నప్పుడు సమగ్రమయిన విషయ సేకరణ, ఆ విషయాలన్ని ఒక కూర్పులో ఉండాలని నా అకాంక్ష. కమ్యూనిజం ప్రతిపాదించిన ఆ మొదటి వారు, దాన్ని ఒక జీవన విధానమనే ప్రతిపాదించారు. కాని, మీరన్నట్టు, కొంతకాలానికి అది కమ్యూనిస్ట్ పిడివాదుల నోళ్ళలో పడిపొయి, ప్రస్తుత పరిస్తితికి వచ్చింది. మరొక డాంబికమైన రాజకీయ పార్టీ గా మారింది.--SIVA 14:32, 15 జూన్ 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వ్యాసం ప్రస్తుతం "ఈ వారపు వ్యాసం" గా ప్రదర్శించబడుతున్నది. నా ఉద్దేశ్యంలో, పార్టీలకు సంబంధించిన బొమ్మలు తొలగిస్తే బాగుంటుందని.--SIVA 01:17, 16 జూన్ 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

శైలి[మార్చు]

ఇందులోని మూడు, నాలుగు విభాగాల్లో సమాచారాన్ని పాయింట్లుగా వ్రాశారు. ఏదో అవి-ఇవీ సంబంధంలేని చిన్న సమాచారాలు, జాబితాలు వ్రాయటానికి అలా పాయింట్ల పద్ధతి బాగుంటుంది కానీ వ్యాసంలో ముఖ్యభాగాలకు నప్పదు. ఆ విభాగాలు తిరగవ్రాయాలి. --వైజాసత్య 03:46, 28 జూన్ 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]